రైల్వేస్టేషన్లో చెత్తవేస్తే జరిమానా | Fine if garbage thrown in railway stations | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్లో చెత్తవేస్తే జరిమానా

Published Fri, Sep 23 2016 1:54 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

రైల్వేస్టేషన్లో చెత్తవేస్తే జరిమానా - Sakshi

రైల్వేస్టేషన్లో చెత్తవేస్తే జరిమానా

  • సీఎంఎం సత్యనారాయణ
  • నెల్లూరు(సెంట్రల్‌) : రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు నిబంధనలకు విరుద్ధంగా చెత్త వేస్తే రూ.500 వరకు జరిమానా విధిస్తామని సికింద్రాబాద్‌ డివిజన్‌ చీఫ్‌ మెటీరియల్‌ మేనేజర్‌ (సీఎంఎం) సత్యనారాయణ అన్నారు. నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్‌లో గురువారం స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వారంరోజుల పాటు దేశంలోని అన్ని రైల్వేస్టేషన్‌లలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రయాణికులకు స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత కూడా ఎవరైనా స్టేషన్‌లో చెత్త వేస్తే జరిమానా వేస్తామని చెప్పారు. అంతకుముందు స్వచ్ఛ నాటిక ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ టికెట్‌ మేనేజర్‌ సాగర్, రమేష్, మునీర్, నాయక్, ఇన్‌చార్జి ఎస్‌ఎస్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement