‘కంపు’లో.. ‘అనంత’ వినాశనం!
– నగరంలో ఇప్పటి వరకూ రూ.70 కోట్లు ఖర్చుచేసిన పాలకవర్గం
– అధికశాతం నిధులు నేతల జేబుల్లోకే
– ‘అధికార’ పక్షానికి యంత్రాంగం జీహుజూర్
– కలుషిత నీరు, అపరిశుభ్రతే రోగాలకు ప్రధాన కారణం
– చిన్నారుల మతి తర్వాత జిల్లా అధికారుల హడావుడి
నగరంలో నివసించే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం నుంచి ఆశించేది ప్రధానంగా రెండే. ఒకటి స్వచ్ఛజలం, మరొకటి మెరుగైన పారిశుద్ధ్యం. ఈ రెండూ సక్రమంగా ఉంటే సగం రోగాలు దరిచేరవు. కానీ వీటిపై కార్పొరేషన్ వైఖరి దారుణంగా ఉంది. ప్రస్తుత పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకూ రూ.72 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారు. కానీ కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేకపోయారు. ప్రతిపనిలో ‘ఎంత వస్తుందనే’ కోణంలోనే ఆలోచించారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేశారు.
దీని పర్యవసానమే.. ఇద్దరు చిన్నారులు మత్యువాత. బయటికి తెలిసింది వీరిద్దరే కానీ.. వెలుగులోకి రాని మతుల సంఖ్య ఎక్కువగానే ఉంది. కార్పొరేషన్ నిర్లక్ష్యంపై పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించని అధికారులు, పాలకవర్గం...కనీసం చిన్నారుల మతితోనైనా కళ్లు తెరవాలని ప్రజలు కోరుతున్నారు.