ప్రముఖ హాలీవుడ్ సింగర్, గేయ రచయిత టేలర్ స్విఫ్ట్‌కు న్యూయార్క్ మున్సిపల్ అధికారులు షాకిచ్చారు. ఆమెకు తన ఇంటిముందు ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచలేదని ఏకంగా 2.4 లక్షల జరిమానా విధించారు. అయితే ఆమెకు ఇప్పటికే అధికారులు 32 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని వెల్లడించారు. అయితే ఈ జరిమానాలు మొత్తం ఐదేళ్ల కాలానికి సంబంధించినదిగా తెలుస్తోంది. ఆమె భవనం ముందు చెత్త ఉంచినందుకు జనవరి 2018 నుంచి 2023 వరకు పలుసార్లు ఫైన్ విధించారు.
(ఇది చదవండి: నిహారిక-చైతన్యల విడాకులు.. ముందుగా పిటిషన్ వేసింది ఎవరంటూ..)
టేలర్ తన మూడు అంతస్తుల భవనం ముందు చెత్తను సరిగా తీసివేయడం లేదని అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానికి మీడియా కథనం ప్రకారం టేలర్ ఇంటి వెలుపల వార్తాపత్రికలు, సీసాలు, కార్డ్‌బోర్డ్, నాప్‌కిన్స్ కుప్పలు కుప్పలుగా పేరుకుపోయినట్లు తెలుస్తోంది. వాటితో పాటు చెల్లా చెదురుగా పడి ఉన్న యాష్‌ట్రేలు, సిగరెట్ కార్టన్ కూడా ఉన్నాయని నివేదికలో పేర్కొంది. అయితే పలువురు అభిమానులు మాత్రం అధికారుల తీరును తప్పుబడుతున్నారు. ఆమెకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని చెబుతున్నారు. టేలర్ సిగరెట్స్, మందు తాగడం చేయదని అంటున్నారు.
(ఇది చదవండి: బేబీ డైరెక్టర్‌కు బ్రో షూ గిఫ్ట్.. వేలల్లో కాదు లక్షల్లో!)
Comments
Please login to add a commentAdd a comment