రామాంతపూర్‌లో దారుణం
హైదరాబాద్: అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకుండి పక్కన పడేసి వెళ్లారు. ఈ సంఘటన నగరంలోని రామాంతపూర్ వెంకట్‌రెడ్డి నగర్‌లో ఆదివారం వెలుగుచూసింది. స్థానిక బస్టాప్ పక్కన ఉన్న చెత్తకుండి వద్ద అప్పుడే పుట్టిన చిన్నారి ఏడుస్తుండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు శిశువును వైద్య చికిత్సల నిమిత్తం నీలొఫర్ ఆస్పత్రికి తరలించారు. పసికందు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.