
కాలు తీసి చెత్తకుండీలో వేశారని సమన్లు
ఫ్లోరిడా: తన కాలు తీసి చెత్తకుండీలో వేసినందుకు ఓ ఆస్పత్రికి సమన్లు పంపించిన ఘటన దక్షిణ ఫ్లొరిడాలో చోటుచేసుకుంది. జాన్ టిమిరియాసైఫ్(56) అనే వ్యక్తికి ఇన్ ఫెక్షన్ కారణంగా మొకాలి నుంచి కిందివరకు కాలును ఫ్లొరిడా ఆస్పత్రి వైద్యులు తొలగించారు. అక్కడి చట్ట ప్రకారం ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది. అయితే, తన కాలు బాగాన్ని చెత్తకుప్పలో గమనించిన జాన్ టిమిరియాసైఫ్ తన మనోభావం దెబ్బతినడంతో సదరు ఆస్పత్రికి సమన్లు పంపించాడు.