వంద మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనేది ఒక ధర్మ సూత్రం. కానీ ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి చేయని నేరానికి ఏకంగా 37 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. తాను తప్పు చేయలేదని ఎంత మొత్తుకున్నా ఎవరూ అతని మాటలు పట్టించుకోలేదు. ఫలితంగా విలువైన జీవితంలో విలువైన సమయంలో జైలులో మగ్గిపోవాల్సి వచ్చింది. చివరికి న్యాయమే గెలచింది. ఒక కేసులో దొరికిన ఓ సాక్ష్యం ఆధారంగా అతణిని నిర్దోషిగా తేల్చింది. ఈ తప్పిందం దొర్లినందుకు గాను అతనికి రూ. 116 కోట్ల రూపాయలు భారీ పరిహారాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
అసలేమైందంటే..
లైంగికదాడి, హత్య వంటి ఆరోపణలపై ఫ్లోరిడాకు చెందిన రాబర్ట్ డుబోయిస్‌ను 1982లో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికి అతని వయసు 18 ఏళ్లు మాత్రమే. 19 ఏళ్ల బార్బరా గ్రామ్‌ను అత్యాచారం చేసి, చంపేశాడంటూ అభియోగాలు నమోదైనాయి. ఈ కేసులో విచారణ అనంతరం అమెరికాలోని ఒక కోర్టు తొలుత అతడికి కోర్టు మరణశిక్ష విధించింది. ఇన్నోసెన్స్ ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్ సహాయంతో అతని శిక్షను 2018లో దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది.
చివరకు తప్పుడు నేరారోపణ కేసులను వాదించడంలో అపారమైన అనుభవం ఉన్న చికాగోకు చెందిన పౌర హక్కుల సంస్థ లోవీ & లోవీ ఈ కేసులో జోక్యం చేసుకుని, ఈ కేసులో బాధితుడి ప్రమేయం లేదని నిరూపించడంలో అతినికి విముక్తి లభించింది. 1980లలో అందబాటులోని, ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన డీఎన్‌ఏ టెస్ట్‌ద్వారా నిర్దోషిగా తేలాడు. 2020 ఆగష్టులో ఫ్లోరిడా జైలు నుండి విడుదలయ్యాడు.
కొంతకాలం తర్వాత, రాబర్ట్ డుబోయిస్ తనకు జరిగిన నష్టానికి న్యాయం కావాలంటూ పోరాటానికి దిగాడు. టంపా నగరం అధికారులు, విచారణలో పాల్గొన్న పోలీసు అధికారులు , ఫోరెన్సిక్ దంతవైద్యుడిపై (బార్బరా మృతదేహంపై ఉన్న పంటి గాట్లను సరిపోలాయని సర్టిఫై చేసిన) కోర్టును ఆశ్రయించాడు. దీన్ని విచారించిన అమెరికా కోర్టు అతని వాదనను సమర్ధించింది. బాధితుడికి 1.4 మిలియన్ డాలర్ల (రూ. 116 కోట్లు) పరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. విడతలవారీగా డుబోయిస్‌ను ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. ఈ సంవత్సరం 90 లక్షల డాలర్లు, వచ్చే ఏడాది 30 లక్షల డాలర్లు, చివరిగా 2026లో 20 లక్షల డాలర్లు డుబోయిస్ అందుకుంటాడు.
Comments
Please login to add a commentAdd a comment