చెత్తపై చైతన్యం కోసం... | Enjoy cozy in Debris | Sakshi
Sakshi News home page

చెత్తపై చైతన్యం కోసం...

Published Sun, Jul 13 2014 2:07 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

చెత్తపై చైతన్యం కోసం... - Sakshi

చెత్తపై చైతన్యం కోసం...

అడ్డమైన చెత్తా చెదారం మధ్య కుటుంబం అంతా హాయిగా ఎంజాయ్ చేస్తోందేమిటా అని అనుకుంటున్నారా? ఈ చెత్తంతా వాళ్లదే. వారం రోజులపాటు వారి కుటుంబం నుంచి వచ్చిన చెత్తని సమీకరిస్తే ఇంతైందన్నమాట. ప్రస్తుత రోజుల్లో జనం జీవనశైలి కారణంగా విపరీతంగా చెత్త పేరుకుపోతోంది. సగటున ఒక్కో అమెరికన్ వల్ల రోజుకు రెండు కిలోల చెత్త పేరుకుంటోంది. దీంతో ఈ అంశంపై వారిని చైతన్యం చేసేందుకు కాలిఫోర్నియా ఫొటోగ్రాఫర్ గ్రెగ్ సేగల్ ‘వారం రోజుల చెత్త’ పేరుతో ఇలాంటి ఫొటోలు తీశారు. చాలామంది వ్యక్తులు ఈ ఫొటోలు చూసైనా అనవసరంగా ఎంత చెత్త పేరుకుపోవడానికి కారణమవుతున్నామో తెలుసుకుని, దాన్ని తగ్గించుకునేందుకు చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతో సేగల్ ఈ చిత్రాలు తీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement