
ఇక నుంచి చెత్తపై పన్ను
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెత్తను తగ్గించడానికి జీహెచ్ఎంసీ ముందడుగు వేసింది. ఇక నుంచి చెత్తపై కూడా పన్ను వసూలు చేయాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది. ప్రతిరోజు 100కిలోలకు పైగా చెత్తను ఉత్పత్తిచేసే వారి నుంచి కిలోకు రూ. 2.25చొప్పున నిర్వహణ చార్జీలు వసూలు చేయడానికి ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆమోదం లభించింది.