వందలకొద్ది ఫిర్యాదులు వస్తున్నాయి | Minister p.narayana unsatisfied to garbage in tirupati | Sakshi
Sakshi News home page

వందలకొద్ది ఫిర్యాదులు వస్తున్నాయి

Published Mon, Oct 6 2014 10:55 AM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM

వందలకొద్ది ఫిర్యాదులు వస్తున్నాయి - Sakshi

వందలకొద్ది ఫిర్యాదులు వస్తున్నాయి

తిరుపతి : తిరుపతిలో పారిశుధ్యంపై మంత్రి నారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఆయన పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తిరుపతిలో పారిశుధ్యంపై వందలకొద్ది ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీనిపై అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించుకోవాలని, మరోసారి ఫిర్యాదులు వస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్లో పట్టణాల ఆధునీకరణకు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని నారాయణ తెలిపారు. పట్టణ ప్రజల మౌలిక వసతులు మెరుగు పరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. పట్టణాల్లో అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని నారాయణ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement