ఓట్ల కోసం మురికి సేవ..! | Dusty service for votes! | Sakshi
Sakshi News home page

ఓట్ల కోసం మురికి సేవ..!

Published Sat, Jan 30 2016 1:51 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

ఓట్ల కోసం మురికి సేవ..! - Sakshi

ఓట్ల కోసం మురికి సేవ..!

నాచారం: నాచారం డివిజన్‌లో ప్రధాన సమస్య.. పెద్ద నాలా శుక్రవారం సాయంత్రం పొంగి ప్రవహించింది. నాచారం పోలీస్‌స్టేషన్ సమీపంలోని పోలేరమ్మ ఆలయం పక్కనే ఉన్న నాలాలో చెత్తాచెదారం పేరుకుపోయి మురుగు నీరు ఒక్కసారిగా ప్రధాన రోడ్డుపైకి చేరింది. అదే సమయంలో స్కూల్ వదలడంతో విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు సాయిజెన్ శేఖర్, టీఆర్‌ఎస్ నాయకులు మేడల మల్లికార్జున్ గౌడ్, టీడీపీ నాయకులు అక్కడకు చేరుకుని తమ అనుచరగణంతో కలిసి మురుగు నీటిలోకి దిగారు. పేరుకుపోయిన చెత్తను తొలగించారు. పిల్లలను రోడ్డు దాటించారు. మున్సిపల్ సిబ్బంది రాకముందే రోడ్డుపై మురుగు సమస్యను పరిష్కరించారు. గెలిచాక ఇదే స్ఫూర్తి ఉంటుందా..! అని స్థానికులు గుసగుసలాడుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement