
ఆత్మహత్య చేసుకున్న సనమత భొత్ర, భగవతి కొలార్
సాక్షి, జయపురం: తమ ప్రేమను పెద్దలు నిరాకరించారన్న మనస్థాపంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన నవరంగపూర్ జిల్లాలోని ఉమ్మర్‌కోట్ సమితిలో సోమవారం చోటుచేసుకుంది.విషయం తెలుసుకున్న ఉమ్మర్‌కోట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదన్న కారణంతో ఆ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.వివరాలిలా ఉన్నాయి.. హీరాఫూల్ గ్రామ పంచాయతీలోని నువాగుడ గ్రామానికి చెందిన సనమత భొత్ర(21), భగవతి కొలార్(19)లు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
భగవతి తండ్రి తులారాం కొలార్, సమీపంలోని ఓ గ్రామానికి శనివారం వెళ్లాడు. పనులు ముగించుకుని, తిరిగి ఇంటికి రాగా, ఆ ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. తలుపు తట్టి, కూతురును పిలవగా, ఎంతసేపైనా రాకపోయేసరికి పక్క ఇంటి వారి సాయంతో తులారాం తలుపులు విరగ్గొట్టాడు. అనంతరం ఇంట్లో ఒక దూలానికి వేలాడుబడుతున్న ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. కూతురి శవమైన కనిపించడంతో తులారాం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment