భర్త వాట్సాప్‌కు భార్య అశ్లీల వీడియోలు | Wife Boyfriend Adult Photos Whatsapp to Husband In Orissa | Sakshi
Sakshi News home page

భర్త వాట్సాప్‌కు భార్య అశ్లీల వీడియోలు

May 4 2018 9:56 AM | Updated on Jul 12 2019 3:07 PM

Wife Boyfriend Adult Photos Whatsapp to Husband In Orissa - Sakshi

సాక్షి, జయపురం: ఓ ఆదివాసీ వివాహిత బాయ్‌ఫ్రెండ్‌ ఆమె అశ్లీల చిత్రాలను భర్తకు పంపిన సంఘటన ఒడిశాలో వెలుగుచూసింది. ఆమె వివాహం జరిగిన పది రోజుల్లోనే ఇటువంటి సంఘటన జరగడంతో  ఆ కుటుంబంలో వివాదాలు తలెత్తాయి.  జయపురం సదర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక గ్రామానికి చెదిన యువకుడికి, బొరిగుమ్మకు చెందిన ఓ యువతికి గడిచిన ఏప్రిల్‌ 20వ తేదీన వివాహం జరిగింది. వారు ఇంకా వైవాహిక జీవితం ఆరంభించకుండానే వారి మధ్య చిచ్చు పెట్టేందుకు ఓ యువకుడు అశ్లీలంగా ఉన్న వధువు ఫొటోలను ఆమె భర్త వాట్సాప్‌కు పోస్ట్‌చేశాడు. 

ఆ ఫొటోలు వాట్సాప్‌లో పెట్టిన వ్యక్తి ఆమె బాయ్‌ఫ్రెండ్‌ అని తెలుస్తోంది. తన వాట్సాప్‌కు వస్తున్న అశ్లీల ఫొటోలను చూసిన వరుడు జయపురం సదర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా తాను భార్యతో ఉండలేనని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా వీడియో క్లిప్పింగ్‌లు వాట్సాప్‌కు పోస్టు చేసిన వ్యక్తి గురువారం అస్కాలో పట్టుబడినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement