adult pictures
-
షాకింగ్.. హీరోయిన్ ఇన్‌స్టా పేజీలో న్యూడ్ ఫోటోలు!
బయటే కాదు స్క్రీన్ మీద కూడా సంప్రదాయబద్దకంగా నడుచుకునే నటి సాధికా వేణుగోపాల్. అలాంటిది ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్ పేజీలో నగ్న ఫోటోలు దర్శనమిచ్చాయి. కొంతమంది ఇండస్ట్రీ జనాలు ఆమెకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో సాధిక షాకై.. పోలీసులను సంప్రదించింది. వివరాల్లోకి వెళితే.. మలయాళ నటి సాధికా వేణుగోపాల్‌కు ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘మీరు పద్దతిగా నటిస్తారనుకున్నాం కానీ, సోషల్ మీడియాలో ఇలాంటి నగ్న ఫోటోలు పెడతారాని ఊహించలేదండి’అని ఆయన అన్నారు. దీంతో కంగుతిన్న సాధిక.. ‘ఏంటి? నా ఇన్‌స్టాలో బూతు బొమ్మలా? నేను ఎక్స్‌పోజింగే చేయను, అలాంటిది న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎలా పెడతాను? అని తిరిగి అతన్ని ప్రశ్నించింది. ఆ అకౌంట్ ఆమె పేరు మీదనే ఉందని, ఫోటోలు తనవే అని చెబుతూ.. ఆ లింక్‌ని సాధికాకు షేర్ చేశాడు సదరు వ్యక్తి. ఆ లింక్ ఓపెన్ చేసిన నటికి దిమ్మతిరిగిపోయింది. ఆమె ఫోటోలను మార్పింగ్ చేసి నలికీ అకౌంట్‌తో సోషల్ మీడియాలో నగ్న ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపి ఆధారంగా సదరు ప్రబుద్దుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతని కెరీర్ పాడుచేయటం ఇష్టం లేక గట్టి వార్నింగ్ ఇచ్చి, కేసు వాపసు తీసుకుంది సాధికా. ఈ విషయాన్ని సాధిక తన అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. View this post on Instagram A post shared by Sadhika Venugopal official (@radhika_venugopal_sadhika) -
భర్త వాట్సాప్‌కు భార్య అశ్లీల వీడియోలు
సాక్షి, జయపురం: ఓ ఆదివాసీ వివాహిత బాయ్‌ఫ్రెండ్ ఆమె అశ్లీల చిత్రాలను భర్తకు పంపిన సంఘటన ఒడిశాలో వెలుగుచూసింది. ఆమె వివాహం జరిగిన పది రోజుల్లోనే ఇటువంటి సంఘటన జరగడంతో ఆ కుటుంబంలో వివాదాలు తలెత్తాయి. జయపురం సదర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక గ్రామానికి చెదిన యువకుడికి, బొరిగుమ్మకు చెందిన ఓ యువతికి గడిచిన ఏప్రిల్ 20వ తేదీన వివాహం జరిగింది. వారు ఇంకా వైవాహిక జీవితం ఆరంభించకుండానే వారి మధ్య చిచ్చు పెట్టేందుకు ఓ యువకుడు అశ్లీలంగా ఉన్న వధువు ఫొటోలను ఆమె భర్త వాట్సాప్‌కు పోస్ట్చేశాడు. ఆ ఫొటోలు వాట్సాప్‌లో పెట్టిన వ్యక్తి ఆమె బాయ్‌ఫ్రెండ్ అని తెలుస్తోంది. తన వాట్సాప్‌కు వస్తున్న అశ్లీల ఫొటోలను చూసిన వరుడు జయపురం సదర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా తాను భార్యతో ఉండలేనని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా వీడియో క్లిప్పింగ్‌లు వాట్సాప్‌కు పోస్టు చేసిన వ్యక్తి గురువారం అస్కాలో పట్టుబడినట్లు తెలిసింది. -
అడల్ట్ చిత్రాలు మరిన్ని రావాలి
తమిళసినిమా: అడల్ట్ చిత్రాలు మరిన్ని వచ్చినా తప్పులేదు అని పేర్కొన్నారు వర్ధమాన దర్శకుడు సంతోష్ పి.జయకుమార్. ఈయన హరహర మహాదేవకీ అనే అడల్ట్ డార్క్ కామెడీ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. గౌతమ్ కార్తీక్ హీరోగా నటించిన ఈ చిత్రం కమర్శియల్‌గా మంచి వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని బ్లూఘోస్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన నిర్మాత కేఈ.జ్ఞానవేల్‌రాజానే తాజాగా ఇదే దర్శక, కథానాయకుడితో రూపొందించిన చిత్రం ఇరుట్టు అరయిల్ మురట్టు కుత్తు. ఇదీ అడల్ట్ కామెడీ కథా చిత్రమే. ఇందులో గౌతమ్ కార్తీక్‌కు జంటగా యాషీక ఆనంద్, వైభవి శాండిల్య, చంద్రిక రవి ముగ్గురు హీరోయిన్లు రొమాన్స్ చేశారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విలేకరులతో బుధవారం ముచ్చటించారు. చిత్రం గురించి దర్శకుడు సంతోష్ పి.జయకుమార్ మాట్లాడుతూ ఇంతకు ముందు చాలా మంది చాలా బ్యానర్లలో చిత్రాలు చేశారని, అడల్ట్ బ్యానర్లో ఎందుకు చిత్రం చేయకూడదన్న ఆలోచనతో తెరకెక్కించిన చిత్రమే ఇరుట్టు అరయిల్ మురట్టు కుత్తు అని చెప్పారు. ఇంతకు ముందు 30 శాతం అడల్ట్ సన్నివేశాలున్న చిత్రాలు వచ్చాయని, ఇది 100 శాతం అడల్ట్ కథా చిత్రం అని చెప్పారు. అందుకే కుటుంబ సమేతంగా తమ చిత్రాన్ని చూడడానికి రావద్దు అని చెబుతున్నామని పేర్కొన్నారు. ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు చిత్రాన్ని ముగ్గురు మహిళా సభ్యురాళ్లు, ఇద్దరు మగ సభ్యులు చూశారని చెప్పారు. చిత్రం చూసిన తరువాత ఎలాంటి సర్టిఫికెట్ కావాలని సెన్సార్ సభ్యులు అడిగారని, ఏ సర్టిఫికెట్ ఇచ్చినా పర్వాలేదని తాము అన్నామని చెప్పారు. చిత్రంలో పలాన సన్నివేశాలున్నాయిగా వాటిని తొలగిస్తామని అంటే తాము ఓకే చెప్పామన్నారు. ఇంతకు ముందు ఇలాంటి అడల్ట్ కథాంశంలో హరహర మహాదేవకీ చిత్రం చేశారు. మళ్లీ అదే బ్యానర్లో ఇరుట్టు అరైయిల్ మురట్టుకుత్తు తెరకెక్కించారు. మీపై ఈ తరహా ఇమేజ్ ముద్ర పడే అవకాశం ఉంటుందన్న భయం లేదా? అన్న ప్రశ్నకు అలాంటి భయం లేదన్నారు. ఎందుకంటే తన తదుపరి చిత్రం గజనీకాంత్ మంచి ఎంటర్టెయిన్మెంట్ అంశాలతో కూడిన కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. తమిళ సినిమాలో అడల్ట్ చిత్రాలకు మీరు మార్గం చూపారని భావించవచ్చా? అన్న ప్రశ్నకు నిజం చెప్పాలంటే అలాంటి చిత్రాలు మరిన్ని వచ్చినా తప్పు లేదని అన్నారు. మనం కొన్ని విషయాలను గుట్టుగా ఉంచడం వల్లే సమాజంలో అత్యాచారాల్లాంటి సంఘటనలు జరగుతున్నాయని దర్శకుడు పేర్కొన్నారు. చిత్ర హీరో గౌతమ్‌కార్తీక్ మాట్లాడుతూ దర్శకుడు సంతోస్ పి.జయకుమార్ ఈ చిత్ర కథను జస్టిఫై చేస్తారన్న నమ్మకంతోనే తాను నటించడానికి సమ్మతించానన్నారు. హర హర మహాదేవకీ చిత్రాన్ని చూసిన తన తండ్రి కార్తీక్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది అని చాలా ఎంజాయ్ చేశారని తెలిపారు. ఈ చిత్రాన్ని చూడడానికి ఆసక్తిగా ఉన్నారని అన్నారు. అయితే ఇలాంటి చిత్రాలు తాను మళ్లీ ఇప్పుట్లో చేయనని చెప్పారు. తదుపరి మంచి ప్రేమ కథా చిత్రం, మంచి యాక్షన్ చిత్రం చేయాలనుకుంటున్నానని అన్నారు. -
ప్రేక్షకుల వెర్రి అభిమానంతోనే నా సక్సెస్!
సన్నీ లియోన్... ఈ పేరే ఓ సంచలనం. శృంగార చిత్రాల నాయికగా సన్నీ పొందిన ప్రఖ్యాతి అంతా ఇంతా కాదు. 41 శృంగార చిత్రాల్లో నటించిన సన్నీ, అత్యధికంగా శృంగార చిత్రాలకు కూడా దర్శకత్వం వహించింది. రెండేళ్ల క్రితం ‘బిగ్‌బాస్’ షోలో పాల్గొని, బాలీవుడ్లో పాపులర్ అయిపోయిన ఆమె.. బాలీవుడ్లో బిజీ తార. ప్రస్తుతం ఓ అరడజను సినిమాలు సన్నీ చేతిలో ఉన్నాయి. దీనంతటికీ కారణం ప్రేక్షకులు పిచ్చి అభిమానమేనని సన్నీ లియోన్ తెలిపింది. ప్రస్తుతం దక్షిణాది చిత్రాల్లో రెండు పాటల్లో నటించడానికి ఓకే చెప్పిన ఈ అమ్మడు.. ఐటం సాంగ్స్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని తెలిపింది. ఐఎన్ఎస్ కు ఇచ్చిన తాజా ఇంటర్యూలో సన్నీఈ వ్యాఖ్యలు చేసింది. 'నేను ఈ స్థాయిలో ఉండటానికి ప్రేక్షకుల పిచ్చి అభిమానమే. అలలా వచ్చిన నాకు ఇంతటి అభిమానం ఉందంటే అది కచ్చితంగా అభిమానులదే. వారి అండ దండలే నా సంతోషానికి కారణం'అని సన్నీ పేర్కొంది. హిందీ చిత్రాల్లో దూసుకుపోతున్న సన్నీ.. త్వరలోనే హిందీ చిత్రాలకు డబ్బింగ్ చెబుతానని స్పష్టం చేసింది. శృంగార చిత్రాలకు ఇక స్వస్థి చెప్పాలని అనుకుంటున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.