కన్నీటి వ్యథ: మిమ్మల్నే నమ్ముకుంటే.. వదిలెళ్లారా.. | Cow Died With Power Shock In Mahabubabad District | Sakshi
Sakshi News home page

కన్నీటి వ్యథ: మిమ్మల్నే నమ్ముకుంటే.. వదిలెళ్లారా..

Published Fri, Jun 18 2021 2:10 AM | Last Updated on Fri, Jun 18 2021 8:31 AM

Cow Died With Power Shock In Mahabubabad District - Sakshi

మృతి చెందిన ఆవు వద్ద రోదిస్తున్న రైతు

నర్సింహులపేట: వ్యవసాయాన్నే నమ్ముకున్న కుటుంబం అది.. సాగులో సాయంగా మూడు పశువులు ఉన్నాయి. వర్షాలు కురుస్తుండడంతో దుక్కి దున్ని వ్యవసాయానికి సిద్ధమవుతున్న ఆ రైతు కుటుంబానికి కరెంట్‌ రూపంలో ఆపద వచ్చింది. మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురంలో గురువారం గాలిదుమారం రాగా జామాయిల్‌ తోటలో కరెంట్‌ తీగ తెగి పడింది. ఈ విషయం తెలియక రామచంద్రు మధ్యాహ్నం వరకు నాగలి దున్ని పశువులను మేతకు వదిలాడు. ఇంతలోనే పశువులు విద్యుత్‌ తీగను తాకి మృతి చెందాయి. రూ.1.50 లక్షల విలువైన ఒక కాడెద్దు, ఆవు, కోడె లేగ చనిపోవడంతో ఆ రైతు కుటుంబం వాటిపై పడి రోదించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. 

ఇక్కడ చదవండి: మూగజీవాలపై యమపాశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement