
హైస్కూల్ గ్రౌండ్‌లో గుర్తు తెలియని యువకుడి మృతదేహం
జయపురం : జయపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శనివారం ఉదయం ఒక యువకుడి మృతదేహం ఫుట్‌బాల్ గోల్ స్తంభానికి వేలాడుతూ కనిపించింది. అయితే మృతి చెందిన యువకుడు ఎవరన్నది ఇంతవరకు గుర్తించ లేదు. మృతదేహం కింద ఒక ప్లాస్టిక్ స్టూల్ పడి ఉంది. మృతదేహం ఉన్న పరిస్థితిని బట్టి ప్లాస్టిక్ స్టూల్ ఎక్కి దానిపై నుంచి ఫుట్‌బాల్ గోల్ స్తంభానికి ఉరి వేసుకున్నట్లు కనిపిస్తోందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే మృతి చెందిన యువకుడు ఎవరు? ఎక్కడి నుంచి ఈ ప్రాంతానికి వచ్చాడు? ఆత్యహత్య చేసుకుని ఉంటే ఎందుకు చేసుకున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లేదంటే యువకుడిని ఎవరైనా హత్య చేసి స్వంభానికి వేలాడదీశారా? అన్న అనుమానాలను మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకున్నాడా? హత్యకు గురయ్యాడా? అన్నది ఏది పోస్ట్‌మార్టం జరిగిన తరువాత వెల్లడి కావచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment