ముగ్గురు యువతుల అదృశ్యం | disappearance of three young girls | Sakshi
Sakshi News home page

ముగ్గురు యువతుల అదృశ్యం

Published Mon, Oct 2 2017 2:54 AM | Last Updated on Mon, Oct 2 2017 3:28 AM

disappearance of three young girls

జయపురం: వారపు సంతకు వెళ్లిన ముగ్గురు యువతులు 5 రోజులుగా  కనిపించడం లేదని  వారి కుటుంబసభ్యులు చందాహండి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. తమ పిల్లల కోసం అన్ని ప్రాంతాలలోను వెతికినా ఆచూకీ తెలియరాలేదని పోలీసుల ముందు వాపోయారు..  బాధితులు పోలీసులకు తెలిపిన ఫిర్యాదు ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నవరంగ్‌పూర్‌ జిల్లా చందాహండి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బటిపడ గ్రామానికి చెందిన విక్రమనాయక్‌ కుమార్తె తహీరామణి నాయక్, అదే గ్రామానికి చెందిన సజన్‌ మఝి కుమార్తె రంజుల మఝి, కౌశల్య బాగ్‌ కుమార్తె ధనమతి బాగ్‌లు చందాహండిలో జరిగే వారపు సంతకు వెళ్లారు.

అయితే సంత ముగిసినా వారు ఇంటికి తిరిగి రాలేదు.  సంతలోను, బంధువుల ఇళ్లలోను స్నేహితులను, అడిగామని అంతేకాకుండా అన్ని ప్రాంతాలలోను వెతికినా వారి జాడ తెలియలేదని  ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డల జాడ తెలుసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చందాహండి పోలీసులు దర్యాప్తు  ప్రారంభించారు. అయితే ఇంతకీ 5 రోజులుగా కనిపించని ఆయువతులు ఏమయ్యారన్నది చ్చనీయాంశమైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement