Disappearance case
-
వీడని యువకుడి అదృశ్యం మిస్టరీ..
మంగళగిరి: నవులూరుకు డిజైనర్ మహేష్ అదృశ్యం మిస్టరీగా మారింది. రెండు రోజుల కిందట తనని కేసులో ఇరికించారని ఆ కేసులో తనను నిందితుడిగా చేస్తే తను బతకలేనంటూ ఆత్మహత్య చేసుకుంటానంటూ అతని సన్నిహితులకు సెల్ఫోన్లో మెసేజ్‌లు పెట్టి అదశ్యమయ్యాడు. మహేష్ అద్యశ్యంపై బుధవారం రాత్రి అతని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో అదశ్యమైన మహేష్‌తో ఓ వ్యక్తి మాట్లాడిన ఆడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మహేష్‌కు ఫోన్ చేసిన వ్యక్తి తాడేపల్లి, మంగళగిరి స్టేషన్లు తమ సొంత స్టేషన్లని చెబుతూ ఏమి చేసినా స్టేషన్లలో తమను ఎవరు ఏమి చేయరని, ఇప్పుడు ఒక స్టేషన్‌ను కొంటున్నామని నీవు భయపడాల్సిన అవసరం లేదంటూ మాట్లాడడం గమనార్హం. తెలిసి తప్పు చేయడంతోపాటు నీచేత తప్పు చేయించామని అయినా ఏమీ కాదని, నిన్ను ఎవరు ఏమి చేయలేరని, నన్ను నమ్మి నీవు రిస్క్ చేసి పనిచేసి పెట్టావని నేను ఉండగా నీకేమి కాదంటూ మీ ఆవిడను తీసుకుని ఎటైనా వెళ్తావా, వైజాగ్‌లో రిసార్ట్ బుక్ చేయమంటవా నీ ఐడీ కూడా నేను దొంగలించాను అయితే ఎంటి అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండడం గమనార్హం. ఫిర్యాదులో నీ పేరు లేనపుడు నీవు ఎందుకు లొంగిపోతావు..నిన్ను బయటకు తీసుకురాలేకపోతే అప్పుడు నీవు నిజాలన్నింటిని పోలీసులకు చెప్పు అని ఆడియోలో మాట్లాడిన మాటలను పోలీసులు పరిగణనలోకి తీసుకుని విచారణ చేసి అసలైన నిందితులను పట్టుకుని తమ కుమారుడిని కాపాడాలని మహేష్ తల్లి కోరుతున్నారు. చదవండి: నోట్లో గుడ్డలు కుక్కి.. పీక నులిమి హత్య! ఏం ఎరగనట్టు నాటకం.. -
మూడేళ్ల వయసులో అదృశ్యం.. 14 ఏళ్లకు దర్శనం
మదనపల్లె టౌన్: మూడేళ్ల వయసులో అదృశ్యమైన బాలుడు మళ్లీ 14 ఏళ్లకు కనిపించడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఉద్వేగానికి లోనై బిడ్డను గుండెలకు హత్తుకున్నారు. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన శంకర్, రెడ్డెమ్మ దంపతుల కుమారుడు ఆకాష్. మూడేళ్ల వయసులో ఇంటి దగ్గర ఆడు0కుంటుండగా అదృశ్యమయ్యాడు. దీంతో తల్లిదండ్రులు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి గాలింపు చేపట్టారు. మదనపల్లె మండలం రామాపురానికి చెందిన వెంకటరమణ, లలిత దంపతులు 14 ఏళ్లుగా ఓ బాలుడిని పెంచుకుంటున్నట్టు సీఐ నరసింహులుకు సమాచారం వచ్చింది. వారిని విచారించగా 2008లో నీరుగట్టువారిపల్లెలో బాలుడు దొరికినట్టు ఒప్పుకున్నారు. దీంతో బాలుడిని ఆకాష్‌గా గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి తమ బిడ్డను చూసి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. పట్టరాని సంతోషంతో బిడ్డను తమతో తీసుకెళ్లారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. -
వ్యభిచార రొంపి.. వెట్టి కూపంలోకి!
సాక్షి, హైదరాబాద్: పిల్లల అదృశ్యం కేసులను ఛేదించలేక పోలీసులు క్లోజ్ చేస్తే ఎలాగని హైకోర్టు ప్రశ్నించింది. అదృశ్యమైన ఆడపిల్లలు వ్యభిచార కూపంలోకి, బాలురు వెట్టిచాకిరీలోకి, మైనార్టీలనైతే ఉగ్రవాదం రొంపిలోకి బలవంతంగా నెట్టేస్తున్నారని ధర్మాసనం ఆవేదన వ్యక్తంచేసింది. పిల్లల అదృశ్యం కేసుల్ని పోలీసులు తగిన రీతిలో పట్టించుకోవడం లేదని దాఖలైన పిల్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం.. అదృశ్యమైన పిల్లలకు ఉగ్రవాదంలో తర్ఫీదు ఇచ్చి తిరిగి వాళ్లను దేశంపైకి వదిలితే ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితుల్నీ పోలీసులు అంచనా వేయాలని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది పిల్లలు అదృశ్యమయ్యా రో, వారిలో ఎవరినైనా అక్రమ రవాణా చేశారా, మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వ విధానం ఏంటో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యా యో, ఎన్ని కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారో, ఎంతమందిని రక్షించారో తెలపాలంది. మానవ అక్రమ రవాణాలో ఇతర రాష్ట్రాల పిల్లలుంటే ప్రభుత్వం వారి విషయంలో ఏవిధంగా చేస్తోందో తెలపాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లల అదృశ్యం కేసుల్ని పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే పోలీసులు క్లోజ్ చేస్తున్నారని న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం సోమవారం విచారించింది. పూర్తి వివరాలతో వచ్చే నెల 6లోగా కౌంటర్ దాఖలు చేయాలని, అదే నెల 10న తిరిగి విచారణ చేస్తామని పేర్కొంది. పిల్లల బాధలు వర్ణనాతీతం.. రాజస్తాన్‌లో అదృశ్యమైన వారిలో సగం మంది బాలికలేనని, అందులో 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారేనని విచారణలో ధర్మాసనం చెప్పింది. రాజస్తాన్‌కు చెందిన యువతులు గుజరాత్లో పట్టుబడితే ఉద్యోగాల కోసం వచ్చారని చెప్పారని, నిజానికి వారందరినీ వ్యభిచారకూపంలోకి నెట్టేశారని ఆవేదనతో వ్యాఖ్యానించింది. వ్యభిచార గృహాలపై ప్రభుత్వం దాడులు చేస్తే అమాయక యువతులను బయటపడేయవచ్చని సూచించింది. వీరి బాధలు వర్ణనాతీతంగా ఉంటే కన్నవారి మనోవేదన దారుణంగా ఉందని పేర్కొంది. గుట్టలో పరిస్థితులు అదుపులోకి తెచ్చాం.. ప్రభుత్వ న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డి వాదిస్తూ.. యాదగిరిగుట్టలోని పలు వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసి అక్కడి పరిస్థితులను అదుపులోకి తెచ్చామని తెలిపారు. ప్రజ్వల అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిల్‌ను ప్రస్తుత వ్యాజ్యంతో కలిపి ఫిబ్రవరి 10న విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. -
అదృశ్యమై..బావిలో శవమై తేలాడు
సాక్షి, మంగళగిరి : రెండు రోజుల కిందట మంగళగిరి పట్టణంలో అదృశ్యమైన బాలుడు మంగళవారం బావిలో శవమై కనిపించాడు. ఎక్కడో ఓ చోట ఉంటాడని భావించిన తల్లిదండ్రులకు ఒక్కసారిగా బాలుడు శవమై కనిపించడంతో, వారి రోదనకు అంతులేకుండాపోయింది. బావిలో శవమై తేలిన బాలుడ్ని చూసి స్థానికులు సైతం కన్నీరుమున్నీరైన సంఘటన మంగళగిరి పట్టణంలో చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... పట్టణ పరిధిలోని ఎన్సీసీ రోడ్డు జండా చెట్టు వద్ద నివాసం ఉంటున్న శంకరరావు, తన కుమారుడు కొల్లి వాసు (7) కనిపించడం లేదంటూ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశాడు. పట్టణ పరిధిలోను, పరిసర ప్రాంతాలు, తమ బంధువులు ఉన్న ఊర్లలో విచారించినా ఎక్కడా కనపడకపోవడంతో ఇంటికి వస్తాడన్న ఆశతో ఎదురుచూసాడు. అయితే మంగళవారం ఉదయం పాత మంగళగిరి మునసబ్ గారి మిల్లు వెనుక ఉన్న నేలబావిలో ఓ బాలుడు శవమై ఉన్నట్లు స్థానికులు గమనించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై భార్గవ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. మృతి చెందిన బాలుడు రెండు రోజుల కిందట అదృశ్యమైన కొల్లి వాసుగా గుర్తించి వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బావి దగ్గరకు చేరుకున్న తల్లిదండ్రులు కొడుకు శవమై ఉండటంతో కన్నీరుమున్నీరయ్యారు. స్థానికుల సహాయంతో పోలీసులు బాలుడ్ని బావిలోనుంచి బయటకు తీశారు. అప్పటికే మూడు రోజులు అవ్వడంతో మృతదేహం బాగా ఉబ్బిపోయి, దుర్వాసన వెదజల్లుతుంది. అయితే ఆదివారమే ఆ బావిలో ప్రమాదవశాత్తు జారి పడి ఉండవచ్చని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రతిరోజూ బావి ఉన్న మైదానంలో పిల్లలు క్రికెట్, ఇతర ఆటలు ఆడుకుంటుంటారు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు కూడా అక్కడ ఆడుకుంటున్న వారికి కనబడ్డాడని, ఆ తర్వాతే ప్రమాదవశాత్తు జారి పడి ఉండవచ్చని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన నేలబావి పాత మంగళగిరి మునసబ్గారి మిల్లు వెనుక ఉన్న మైదానంలో ఎన్నో సంవత్సరాలుగా నేలబావి ఉంది. ఈ నేలబావి ఎవరూ వాడకపోవడంతో చెత్తాచెదారంతో నిండి ఉంది. కనీసం దాని చుట్టూ గోడకాని, ఎలాంటి రక్షణ వలయం కాని లేకపోవడంతో ప్రమాదాలకు నిలయమైంది. 15 రోజుల కిందట కూడా ఒక బాలుడు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు జారి నేలబావిలో పడిపోయాడు. అక్కడే పక్కనే పనిచేస్తున్న తాపీ పనివాళ్లు గమనించి వెంటనే బావిలోనుంచి పిల్లవాడిని రక్షించి ప్రాణాలను కాపాడారు. ఉపయోగంలో లేని ఈ నేలబావిని మూసివేయాలని, లేదా కనీసం బావిచుట్టూ రక్షణ వలయాలనన్నా ఏర్పాటుచేయాలని స్థానికులు కోరుతున్నారు. లేకుంటే ఇలా ప్రమాదాల బారిన పడి ఇంకెన్ని ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఐదేళ్ల తర్వాత పుట్టింటికి..
జడ్చర్ల టౌన్: కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా ముత్తంగి గ్రామానికి చెందిన దరియప్ప అనే యువకుడు ఐదేళ్ల కిందట మతిస్థిమితం కోల్పోయా డు. ఓ సందర్భంలో కుటుంబసభ్యుల నుంచి వి డిపోయి జడ్చర్ల ప్రాంతానికి వచ్చాడు. ఏడాది కా లం నుంచి జడ్చర్లలోని మహాలక్ష్మి సేవాట్రస్టు ఆద్వర్యంలో చిత్తనూరి ఈశ్వర్, రామకృష్ణ నిర్వస్తున్న సత్యేశ్వర ఆశ్రమంలో ఆశ్రయముంటున్నా డు. కొన్నిరోజులుగా అతని ఆరోగ్య పరిస్థితిలో మార్పు వస్తుండటంతో అతడి ఆధార్ నెంబరు ఆదారంగా తల్లిదండ్రులను గుర్తించారు. మంగళవా రం ఎస్పీ అనురాధ సమక్షంలో అప్పగించారు. ఇంకా 35 మంది.. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ ఏడాది చిత్తనూరి ఈశ్వర్, రామకృష్ణలు సత్యేశ్వర ఆశ్రమం పేరుతో మానసిక వికలాంగులకు ఆశ్రయమిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డుపై మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్న ఐదుగురితో ఆశ్రమం ప్రారంభించారు. ప్రస్తుతం ఆశ్రమంలో 35 మంది ఉన్నారు. వీరిలో కొందరికి స్వస్థత చేకూరుతుండటంతో ఆధార్ కార్డులు ఇప్పించేందుకు హైదరాబాద్ ప్రధాన కేంద్రానికి తీసుకువెళ్లారు. అలా వెళ్లిన వారిలో దరియప్ప ఒకరు. దరియప్ప ఆధార్ నమోదుకు ప్రయత్నించగా ఇదివరకే ఉన్న ఆధార్‌కార్డు బయట పడింది. ఆధార్ నెంబరు సహాయంతో జడ్చర్ల సీఐ బాల్‌రాజ్ యాదవ్ దరియప్ప స్వగ్రామం, తల్లిదండ్రుల చిరునామా తెలుసుకున్నారు. ఫోన్లు చేసి తల్లిదండ్రులకు సమాచారం అందించగా మంగళవారం తండ్రి బసప్ప జడ్చర్లకు వచ్చాడు. దీంతో ఎస్పీ అనురాధ దరియప్పను అప్పగించారు. ఐదేళ్లుగా కనబడకుండా పోయిన కొడుకును చూసి తండ్రి ఒక్కసారిగా కన్నీటి పర్వంతమయ్యాడు. పోయిన కుమారుడిని అప్పగించిన ఆశ్రమం నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. మరో నలుగురు మానసికంగా కోలుకున్నందున వారిని కూడా త్వరలోనే ఇళ్లకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఎస్పీ అభినందనలు.. సత్యేశ్వర ఆశ్రమం పేరుతో మానసిక వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తూ వారికి సేవలు అందిస్తున్నందుకు మహాలక్ష్మిసేవాట్రస్టు నిర్వహకులు చిత్తనూరి ఈశ్వర్, రామకృష్ణలకు ఎ స్పీ అనురాధ అభినందించారు. కన్న తల్లిదండ్రులనే పట్టించుకోని ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో మతిస్థిమితం లేకుండా ఉన్న వా రిని ఆశ్రయం ఇవ్వటం భగవత్ కార్యంగా అభివర్ణించారు.అడీషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎ స్పీ భాస్కర్, సీఐ బాల్‌రాజ్ యాదవ్‌లు ఉన్నారు. -
ముగ్గురు యువతుల అదృశ్యం
జయపురం: వారపు సంతకు వెళ్లిన ముగ్గురు యువతులు 5 రోజులుగా కనిపించడం లేదని వారి కుటుంబసభ్యులు చందాహండి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. తమ పిల్లల కోసం అన్ని ప్రాంతాలలోను వెతికినా ఆచూకీ తెలియరాలేదని పోలీసుల ముందు వాపోయారు.. బాధితులు పోలీసులకు తెలిపిన ఫిర్యాదు ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నవరంగ్‌పూర్ జిల్లా చందాహండి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బటిపడ గ్రామానికి చెందిన విక్రమనాయక్ కుమార్తె తహీరామణి నాయక్, అదే గ్రామానికి చెందిన సజన్ మఝి కుమార్తె రంజుల మఝి, కౌశల్య బాగ్ కుమార్తె ధనమతి బాగ్‌లు చందాహండిలో జరిగే వారపు సంతకు వెళ్లారు. అయితే సంత ముగిసినా వారు ఇంటికి తిరిగి రాలేదు. సంతలోను, బంధువుల ఇళ్లలోను స్నేహితులను, అడిగామని అంతేకాకుండా అన్ని ప్రాంతాలలోను వెతికినా వారి జాడ తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డల జాడ తెలుసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చందాహండి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇంతకీ 5 రోజులుగా కనిపించని ఆయువతులు ఏమయ్యారన్నది చ్చనీయాంశమైంది. -
పిల్లలతో తల్లి అదృశ్యం
పీఎంపురం(వజ్రపుకొత్తూరు): వజ్రపుకొత్తూరు మండలం పెద్దమురహరిపురానికి చెందిన పుచ్చ శాంతి, తన ఇద్దరు పిల్లలు సాత్విక్, కుమార్తె తన్వితో కలిసి బుధవారం ఉదయం అదృశ్యమైందని వజ్రపుకొత్తూరు ఎస్ఐ సీహెచ్ ప్రసాద్ చెప్పారు. విద్యుత్ బిల్లు చెల్లింపు విషయంలో అత్తమామలతో విభేదించి గొడవ పడిందన్నారు. ఈమేరకు శాంతి తండ్రి అంగ కూర్మారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాంతి భర్త అప్పలరాజు విదేశాల్లో వలస కూలీగా పని చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాను అత్తవారి వేధింపులు భరించలేక పోతున్నానని, పిల్లలతో కలిసి బీచ్‌లో చనిపోతున్నట్టు గురువారం ఉదయం తన సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సమాచారం పంపిందని తండ్రి కూర్మారావు స్థానిక విలేకరులకు చెప్పారు. తాము సముద్రం వెంబడి గాలిస్తున్నామన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ప్రసాద్ చెప్పారు.