ఆకాష్‌ను తల్లిదండ్రులకు అప్పగించిన సీఐ (ఇన్‌సెట్‌లో) చిన్ననాటి ఆకాష్
మదనపల్లె టౌన్: మూడేళ్ల వయసులో అదృశ్యమైన బాలుడు మళ్లీ 14 ఏళ్లకు కనిపించడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఉద్వేగానికి లోనై బిడ్డను గుండెలకు హత్తుకున్నారు. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన శంకర్, రెడ్డెమ్మ దంపతుల కుమారుడు ఆకాష్. మూడేళ్ల వయసులో ఇంటి దగ్గర ఆడు0కుంటుండగా అదృశ్యమయ్యాడు. దీంతో తల్లిదండ్రులు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి గాలింపు చేపట్టారు.
మదనపల్లె మండలం రామాపురానికి చెందిన వెంకటరమణ, లలిత దంపతులు 14 ఏళ్లుగా ఓ బాలుడిని పెంచుకుంటున్నట్టు సీఐ నరసింహులుకు సమాచారం వచ్చింది. వారిని విచారించగా 2008లో నీరుగట్టువారిపల్లెలో బాలుడు దొరికినట్టు ఒప్పుకున్నారు. దీంతో బాలుడిని ఆకాష్‌గా గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి తమ బిడ్డను చూసి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. పట్టరాని సంతోషంతో బిడ్డను తమతో తీసుకెళ్లారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment