ఎస్పీ అనురాధ సమక్షంలో తండ్రికి అప్పగిస్తున్న నిర్వహకులు
జడ్చర్ల టౌన్: కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లా ముత్తంగి గ్రామానికి చెందిన దరియప్ప అనే యువకుడు ఐదేళ్ల కిందట మతిస్థిమితం కోల్పోయా డు. ఓ సందర్భంలో కుటుంబసభ్యుల నుంచి వి డిపోయి జడ్చర్ల ప్రాంతానికి వచ్చాడు. ఏడాది కా లం నుంచి జడ్చర్లలోని మహాలక్ష్మి సేవాట్రస్టు ఆద్వర్యంలో చిత్తనూరి ఈశ్వర్, రామకృష్ణ నిర్వస్తున్న సత్యేశ్వర ఆశ్రమంలో ఆశ్రయముంటున్నా డు. కొన్నిరోజులుగా అతని ఆరోగ్య పరిస్థితిలో మార్పు వస్తుండటంతో అతడి ఆధార్ నెంబరు ఆదారంగా తల్లిదండ్రులను గుర్తించారు. మంగళవా రం ఎస్పీ అనురాధ సమక్షంలో అప్పగించారు.
ఇంకా 35 మంది..
మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ ఏడాది చిత్తనూరి ఈశ్వర్, రామకృష్ణలు సత్యేశ్వర ఆశ్రమం పేరుతో మానసిక వికలాంగులకు ఆశ్రయమిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రోడ్డుపై మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్న ఐదుగురితో ఆశ్రమం ప్రారంభించారు. ప్రస్తుతం ఆశ్రమంలో 35 మంది ఉన్నారు. వీరిలో కొందరికి స్వస్థత చేకూరుతుండటంతో ఆధార్ కార్డులు ఇప్పించేందుకు హైదరాబాద్ ప్రధాన కేంద్రానికి తీసుకువెళ్లారు. అలా వెళ్లిన వారిలో దరియప్ప ఒకరు. దరియప్ప ఆధార్ నమోదుకు ప్రయత్నించగా ఇదివరకే ఉన్న ఆధార్‌కార్డు బయట పడింది.
ఆధార్ నెంబరు సహాయంతో జడ్చర్ల సీఐ బాల్‌రాజ్ యాదవ్ దరియప్ప స్వగ్రామం, తల్లిదండ్రుల చిరునామా తెలుసుకున్నారు. ఫోన్‌లు చేసి తల్లిదండ్రులకు సమాచారం అందించగా మంగళవారం తండ్రి బసప్ప జడ్చర్లకు వచ్చాడు. దీంతో ఎస్పీ అనురాధ దరియప్పను అప్పగించారు. ఐదేళ్లుగా కనబడకుండా పోయిన కొడుకును చూసి తండ్రి ఒక్కసారిగా కన్నీటి పర్వంతమయ్యాడు. పోయిన కుమారుడిని అప్పగించిన ఆశ్రమం నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. మరో నలుగురు మానసికంగా కోలుకున్నందున వారిని కూడా త్వరలోనే ఇళ్లకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.
ఎస్పీ అభినందనలు..
సత్యేశ్వర ఆశ్రమం పేరుతో మానసిక వికలాంగులకు ఆశ్రయం కల్పిస్తూ వారికి సేవలు అందిస్తున్నందుకు మహాలక్ష్మిసేవాట్రస్టు నిర్వహకులు చిత్తనూరి ఈశ్వర్, రామకృష్ణలకు ఎ స్పీ అనురాధ అభినందించారు. కన్న తల్లిదండ్రులనే పట్టించుకోని ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో మతిస్థిమితం లేకుండా ఉన్న వా రిని ఆశ్రయం ఇవ్వటం భగవత్ కార్యంగా అభివర్ణించారు.అడీషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎ స్పీ భాస్కర్, సీఐ బాల్‌రాజ్ యాదవ్‌లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment