రామారెడ్డి: కూతురు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుందన్న బాధలో ఉన్న ఆ కుటుంబానికి అండగా నిలవా ల్సిన కులపెద్దలు.. పెళ్లి భోజనం పెట్టలేదన్న సాకుతో కుల బహిష్కరణ చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో ఈ ఘటన జరిగింది. మద్దికుంటకు చెందిన యెల్ది పోశయ్య కూతురు ఇటీవల ఇంట్లోంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసు కుంది.
విషయం తెలుసుకున్న కులపెద్దలు కులానికి పెళ్లి భోజనం పెట్టాలని పోశయ్యను అడిగారు. కులాచారం ప్రకారం పెళ్లి వరుడి ఇంట్లో జరుగుతుంది కాబట్టి వాహన ఖర్చుల కింద రూ.10 వేలు ఇవ్వాలన్నారు. కూతురు తమకు చెప్పకుండా వెళ్లిపోయిందని, పెళ్లి భోజనం ఎలా పెట్టాలని ప్రశ్నించినందుకు ఆగ్రహించిన కులపెద్దలు తమ కుటుంబాన్ని బహిష్కరించారని పోశయ్య వాపోయారు. కులపెద్దల తీరును నిరసిస్తూ ఆదివారం బాధిత కుటుంబం ఇంటికి తాళంవేసి ఇంటి ముందు సాయంత్రం వరకు దీక్షచేసింది.
Comments
Please login to add a commentAdd a comment