wedding meal
-
ఆలస్యంగా వెలుగులోకి.. పెళ్లి భోజనం వికటించి..
బొమ్మనహాళ్(అనంతపురం జిల్లా): శ్రీధరఘట్టలో పెళ్లి భోజనం వికటించి 50 మందికి పైగా అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామస్తులు, స్థానికుల వివరాల మేరకు.. మూడు రోజుల క్రితం గ్రామంలో ఓ వివాహం జరిగింది. వివాహంలో బంధుమిత్రులు తిన్న భోజనం వికటించి, వన్నూరుస్వామి, మహేష్, నిరంజన్, పార్వతి, భీమేష్ , నేమకల్లు చాకలి రవి, రామాంజి, హనుమక్క, శ్రీదేవి, మరికొంతమంది అస్వస్థతకు గురయ్యారు. ఎవరికీ ప్రాణాపాయం లేదు. చదవండి: శ్రీకాళహస్తి అమ్మాయి జాక్‌పాట్.. రూ.40లక్షల ప్యాకేజీతో ఉద్యోగం -
పెళ్లి భోజనం పెట్టలేదని.. కుల బహిష్కరణ
రామారెడ్డి: కూతురు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకుందన్న బాధలో ఉన్న ఆ కుటుంబానికి అండగా నిలవా ల్సిన కులపెద్దలు.. పెళ్లి భోజనం పెట్టలేదన్న సాకుతో కుల బహిష్కరణ చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో ఈ ఘటన జరిగింది. మద్దికుంటకు చెందిన యెల్ది పోశయ్య కూతురు ఇటీవల ఇంట్లోంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసు కుంది. విషయం తెలుసుకున్న కులపెద్దలు కులానికి పెళ్లి భోజనం పెట్టాలని పోశయ్యను అడిగారు. కులాచారం ప్రకారం పెళ్లి వరుడి ఇంట్లో జరుగుతుంది కాబట్టి వాహన ఖర్చుల కింద రూ.10 వేలు ఇవ్వాలన్నారు. కూతురు తమకు చెప్పకుండా వెళ్లిపోయిందని, పెళ్లి భోజనం ఎలా పెట్టాలని ప్రశ్నించినందుకు ఆగ్రహించిన కులపెద్దలు తమ కుటుంబాన్ని బహిష్కరించారని పోశయ్య వాపోయారు. కులపెద్దల తీరును నిరసిస్తూ ఆదివారం బాధిత కుటుంబం ఇంటికి తాళంవేసి ఇంటి ముందు సాయంత్రం వరకు దీక్షచేసింది. -
వికటించిన పెళ్లి భోజనం
నార్నూర్ (ఆసిఫాబాద్): పెళ్లి విందు భోజనం వికటించి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. 21 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో చోటు చేసుకుంది. నార్నూర్ మండలం కొత్తపల్లి–హెచ్ గ్రామపంచాయతీ పరిధిలోని కొలాంగూడ (గణపతిగూడ)లో ఇరవై కొలాం గిరిజన కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామానికి చెందిన లక్ష్మిబాయి ఇంట్లో మంగళవారం పెళ్లి జరిగింది. బుధవారం విందు ఏర్పాటు చేశారు. భోజనం వికటించడంతో 24 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో చింటు, అయ్యు, కొడప ముత్తు మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారుల మృతితో గిరిజనుల ఆగ్రహం పీహెచ్సీలో సకాలంలో వైద్యం అందకపోవడం, 108 రాకపోవడంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారని ఆరోపిస్తూ బాధితులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఐటీడీఏ పీవో కొలాంగూడను సందర్శించి పరిస్థితిని ఆరా తీశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మిగతా వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో వసంతరావును ఆదేశించారు. -
చేపల కూర తిప్పలు.. 350మందికి డేంజర్
జయపురం(ఒడిశా): ఒక వివాహ విందు భోజనం విషాదాన్ని తెచ్చిపెట్టింది. భోజనానికి వెళ్లిన దాదాపు 350 మంది అస్వస్థతకు లోనయ్యారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన నవరంగ్‌పూర్ జిల్లా రాయిఘర సమితి ఝొడఝొంగ గ్రామంలో చోటుచేసుకుంది. తురుడిహి పంచాయతీ ఝొడడఝొంగి గ్రామానికి చెందిన బిరెన్ కమారుడి పెళ్లి సందర్భంగా సోమవారం రాత్రి తన బంధుమిత్రులకు చేపల విందుభోజనం పెట్టారు. పలు గ్రామాల నుంచి వందలాది మంది వచ్చి విందు ఆరగించారు. భోజనాల తరువాత తిరిగి వెళ్లేందుకు బయల్దేరుతున్న వారికి అకస్మాత్తుగా వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. విందు భోజనాల దగ్గర ఉన్న వారికి కూడా ఇదే అనుభవం ఎదురవటంతో పరిస్థితి ఒక్కసారిగా ఆందోళనకరంగా మారింది. రాత్రి పొద్దుపోయాక కూడా పరిస్థితి మెరుగుకాక పోవటంతో స్థానికులు బాధితులను ఆస్పత్రులకు తరలించారు. గురుడిహి, పవురబెల, ఝొడఝంగ గ్రామాలకు చెందిన దాదాపు 350 మంది అనారోగ్యం పాలైనట్లు సమాచారం. వారిలో విషమంగా ఉన్న వారిని ఝెడఝంగ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా చికిత్స పొందుతున్నారు.