TransAsia Airways
-
విమాన ప్రమాదం: 24 మృతదేహలు గుర్తింపు
తైపీ: తైవాన్‌లో విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో 24 మందిని గుర్తించినట్లు ఉన్నతాధికారులు శుక్రవారం తైపీలో వెల్లడించారు. మృతులు 16 మంది చైనీయులు, అయిదుగురు తైవాన్ వాసులు, కెప్టెన్‌తోపాటు ఇద్దరు కో పైలట్లు ఉన్నారని తెలిపారు. మరో ఏడు మృతదేహలను గుర్తించవలసి ఉందని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతి చెందిన ఒకొక్కరికి 1.2 మిలియన్ తైవాన్ డాలర్లు అందజేస్తామని తైపీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే గాయాలపాలైన వారికి రూ. 2 లక్షల తైవాన్ డాలర్లు ఎక్స్‌గ్రేషియాగా అందిస్తామని చేప్పారు. ప్రమాదానికి గురైన ట్రాన్స్ ఏషియా విమానం తయారీలో పలు దేశాలు భాగస్వాములుగా ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రమాద ఘటనపై విచారణకు ఆయా దేశాలు పాల్గొన్నాలని కోరామని తెలిపారు. -
కుటుంబాన్ని కాపాడిన వెనుక సీటు
తైపీ:తైవాన్ కు చెందిన విమానం ప్రమాదం జరిగే కొద్ది నిమిషాలకు ముందు ఓ కుటుంబం సీట్లు మారడంతో ప్రాణాలతో బయటపడిన ఘటన ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితే.. లింగ్ మింగ్ కుటుంబం విహారయాత్ర కోసం ట్రాన్స్ ఏసియా విమానంలో బయలుదేరింది. అయితే వారి కూర్చున్న సీటు దగ్గర ఇంజన్ శబ్ధం చిరాకు తెప్పించడంతో వెనుక వైపు ఉన్న ఖాళీగా ఉన్న సీట్లను లింగ్ గమనించాడు. తమ సీట్లను ఖాళీగా ఉన్న వెనుక సీట్లోకి మార్చవలసిందిగా క్యాబిన్ స్టాఫ్‌ని కోరి అక్కడికి వెళ్లి కూర్చున్నారు. ఈ క్రమంలోనే బయలుదేరిన కొద్ది నిమిషాలకే విమానం ఓ పక్కకు ఒరిగి ఫై ఓవర్‌ను ఢీ కొట్టి... ముందుకు దూసుకెళ్లి నదిలో నడిపోయింది. కూలిన విమాన శిథిలాల మధ్య నుంచి లింగ్ బయటకి వచ్చాడు. అంతే మరు క్షణమే తన కుమారుడి కోసం వెతకడం ప్రారంభించాడు. మూడు నిమిషాల తర్వాత తన కొడుకుని కనుగొన్నాడు. కానీ అప్పటికే అతని శ్వాస పూర్తిగా ఆగిపోయింది. అంతే వెంటనే లింగ్ తన కుమారునికి నోటి ద్వారా గాలి అందించడం ప్రారంభించాడు. అతని ప్రయత్నం ఫలించింది. తన కొడుకు తిరిగి శ్వాస తీసుకోవడం ప్రారంభించడంతో హుటా హుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెనుక సీట్లలో కూర్చోవడంతోనే వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఇదే ప్రమాదంలో గాయాలతో బయట పడ్డ లింగ్ భార్య కూడా ఆస్సత్రిలో చికిత్స పొందుతుంది. 'నాకున్న ఒక్కగానొక్క కోడుకు, వాడి ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత నా పై ఉంది' అని సంఘటన అనంతరం లింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. -
ప్రమాదానికి ముందు 'మేడే మేడే' అన్నాడు
తైపీ: ట్రాన్స్ ఏషియా విమాన ఇంజిన్‌లో మంటలు అంటుకునే కొన్ని నిముషాల ముందు పైలట్ మేడే మేడే అని సాంకేతాలు ఇచ్చాడని తైవాన్ పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. అయితే ఈ విమాన ప్రమాదానికి ఇంజన్లో మంటలు కారణం కాదని వారు అభిప్రాయపడ్డారు. అదికాక విమాన ముందుభాగంలో మంటలు ఎగసిపడినట్లు ఎక్కడ ఏ కెమెరాలో నిక్షిప్తం కాలేదని వారు స్పష్టం చేశారు. ఇంతకీ మేడే అంటే ఆపదలో ఉన్నాం... రండి ...మమ్మల్ని రక్షించండి అని అర్థం ట్రాన్స్ ఏసియా 'ఫ్లైట్ జీఈ 235' విమానం ఐదుగురు సిబ్బంది సహా మొత్తం 58 మంది ప్రయాణికులతో ఉత్తర తైపీలోని సాంగ్షాన్ విమానాశ్రయం నుంచి కిన్మెన్ ద్వీపానికి వెళ్లేందుకు టేకాఫ్ తీసుకుంది. బయలుదేరిన కొద్ది నిమిషాలకే విమానం ఓ పక్కకు ఒరిగి ఫైఓవర్ను ఢీ కొట్టి... ముందుకు దూసుకెళ్లి... ముక్కలుగా విడిపోయి... నదిలో పడిపోయింది. అధికార యంత్రంగా వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. దాంతో 15 మందిని రక్షించారు. ఆ విమాన ప్రయాణికుల్లో 31 మంది చైనా పర్యాటకులు ఉన్నా సంగతి తెలిసిందే. -
తైవాన్‌లో విమాన ప్రమాదం
-
విమాన ప్రమాదంలో 31కి చేరిన మృతులు
బీజింగ్: తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య గురువారం 31కి చేరింది. మరో 12 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఈ ప్రమాద ఘటనలో గాయాల బారిన పడి ప్రాణాలతో బయట పడిన 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ట్రాన్స్ ఏసియా 'ఫ్లైట్ జీఈ 235' విమానం ఐదుగురు సిబ్బంది సహా మొత్తం 58 మంది ప్రయాణికులతో ఉత్తర తైపీలోని సాంగ్షాన్ విమానాశ్రయం నుంచి కిన్మెన్ ద్వీపానికి వెళ్లేందుకు టేకాఫ్ తీసుకుంది. బయలుదేరిన కొద్ది నిమిషాలకే విమానం ఓ పక్కకు ఒరిగి ఫైఓవర్ను ఢీ కొట్టి... ముందుకు దూసుకెళ్లి... ముక్కలుగా విడిపోయి... నదిలో పడిపోయింది. అధికార యంత్రంగా వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. దాంతో 15 మందిని రక్షించారు. ఆ విమాన ప్రయాణికుల్లో 31 మంది చైనీయులే ఉన్నా సంగతి తెలిసిందే.