విమాన ప్రమాదంలో 31కి చేరిన మృతులు
బీజింగ్: తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య గురువారం 31కి చేరింది. మరో 12 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఈ ప్రమాద ఘటనలో గాయాల బారిన పడి ప్రాణాలతో బయట పడిన 15 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఉన్నతాధికారులు వెల్లడించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
ట్రాన్స్ ఏసియా 'ఫ్లైట్ జీఈ 235' విమానం ఐదుగురు సిబ్బంది సహా మొత్తం 58 మంది ప్రయాణికులతో ఉత్తర తైపీలోని సాంగ్‌షాన్ విమానాశ్రయం నుంచి కిన్మెన్ ద్వీపానికి వెళ్లేందుకు టేకాఫ్ తీసుకుంది. బయలుదేరిన కొద్ది నిమిషాలకే విమానం ఓ పక్కకు ఒరిగి ఫైఓవర్ను ఢీ కొట్టి... ముందుకు దూసుకెళ్లి... ముక్కలుగా విడిపోయి... నదిలో పడిపోయింది. అధికార యంత్రంగా వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. దాంతో 15 మందిని రక్షించారు. ఆ విమాన ప్రయాణికుల్లో 31 మంది చైనీయులే ఉన్నా సంగతి తెలిసిందే.