విమాన ప్రమాదం: 24 మృతదేహలు గుర్తింపు | 24 victims of Taiwan plane crash identified | Sakshi
Sakshi News home page

విమాన ప్రమాదం: 24 మృతదేహలు గుర్తింపు

Published Fri, Feb 6 2015 9:03 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

విమాన ప్రమాదం: 24 మృతదేహలు గుర్తింపు - Sakshi

విమాన ప్రమాదం: 24 మృతదేహలు గుర్తింపు

తైపీ: తైవాన్లో విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో 24 మందిని గుర్తించినట్లు ఉన్నతాధికారులు శుక్రవారం తైపీలో వెల్లడించారు. మృతులు 16 మంది చైనీయులు, అయిదుగురు తైవాన్ వాసులు, కెప్టెన్తోపాటు ఇద్దరు కో పైలట్లు ఉన్నారని తెలిపారు. మరో ఏడు మృతదేహలను గుర్తించవలసి ఉందని తెలిపారు.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతి చెందిన ఒకొక్కరికి 1.2 మిలియన్ తైవాన్ డాలర్లు అందజేస్తామని తైపీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే గాయాలపాలైన వారికి రూ. 2 లక్షల తైవాన్ డాలర్లు ఎక్స్గ్రేషియాగా అందిస్తామని చేప్పారు. ప్రమాదానికి గురైన ట్రాన్స్ ఏషియా విమానం తయారీలో పలు దేశాలు భాగస్వాములుగా ఉన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రమాద ఘటనపై విచారణకు ఆయా దేశాలు పాల్గొన్నాలని కోరామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement