
సెలబ్రిటీలను అభిమానులు నీడలా వెంటాడుతుంటారు. వారు సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టిన లైకులు కొడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తుంటారు. కానీ అభిమాన తారలు అనవసరమైన వాటిలో దూరినా, ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తుల ప్రకటనల్లో కనిపించినా అస్సలు ఊరుకోరు. సమాజానికి ఏం సందేశమిద్దామనుకుంటున్నారని ఫైర్ అవుతారు. ఇటీవలే పాన్ మసాలా యాడ్‌లో నటించినందుకు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్‌లపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే! దీంతో అక్షయ్ వెనకడుగు వేసి ఆ ప్రకటన నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.
అయితే ఈ యాడ్ వివాదం ఇంకా సద్దుమణగలేదు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన సామాజికవేత్త తమన్నా హష్మీ ఈ హీరోలపై ఫిర్యాదు చేశాడు. అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, రణ్‌వీర్ సింగ్ వంటి స్టార్ హీరోలు డబ్బు కోసం గుట్కా ప్రకటనల్లో కనిపించి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పై నలుగురు హీరోలపై సెక్షన్ 467, 468, 439, 120 బి కింద కేసు నమోదైంది. మే 27న ఈ కేసును న్యాయస్థానం విచారించనుంది.
చదవండి 👉🏾 ఆస్కార్ కొత్త రూల్స్.. ఈ థియేటర్స్‌లో బొమ్మ పడాల్సిందేనట!
Comments
Please login to add a commentAdd a comment