Kuwait Censor Board Bans Ajay Devgn Thank God Movie- Sakshi
Sakshi News home page

Ajay Devagn Thank God Movie: అజయ్‌ దేవగన్‌ షాక్‌కు, అక్కడ ‘థ్యాంక్‌ గాడ్‌’పై నిషేధం

Published Sat, Sep 17 2022 7:12 PM | Last Updated on Sat, Sep 17 2022 8:22 PM

Kuwait Censor Board Bans Ajay Devgn Thank God Movie - Sakshi

బాలీవుడ్‌ హీరో అజయ్ దేవగణ్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థాంక్ గాడ్’. తాజాగా ఈ చిత్రానికి కువైట్‌ ప్రభుత్వం షాకిచ్చింది. కాగా ఇటీవలె షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ క్రమంలో మూవీ ట్రైలర్‌ విడుదల చేయగా.. దీనిపై కువైట్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

చదవండి: కాస్టింగ్‌ కౌచ్‌పై నోరు విప్పిన విష్ణుప్రియ, నన్ను కూడా అలా అడిగారు..

మత విశ్వాసాలను దెబ్బ తీసేలా సినిమా ట్రైలర్ ఉందనే కారణంతో ఈ చిత్రంపై అక్కడి సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాపై నిషేధం విధించింది. అభ్యంతరకరమైన సన్నివేశాలను తీసేస్తేనే... సినిమా విడుదలకు అనుమతిస్తామని తెలిపింది. ఫాంటసీ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంలో చిత్రగుప్తుడిగా అజయ్ దేవగణ్ నటించగా.. సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్‌లు కీలక పాత్రలను పోషించారు. అక్టోబర్ 24న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

చదవండి: గుర్తుపట్టలేనంతగా ‘సీతారామం’ హీరోయిన్‌.. షాకింగ్‌ లుక్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement