kuwait govt
-
అజయ్ దేవగన్‌కు షాక్, అక్కడ ‘థ్యాంక్ గాడ్’పై నిషేధం
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థాంక్ గాడ్’. తాజాగా ఈ చిత్రానికి కువైట్ ప్రభుత్వం షాకిచ్చింది. కాగా ఇటీవలె షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ క్రమంలో మూవీ ట్రైలర్ విడుదల చేయగా.. దీనిపై కువైట్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. చదవండి: కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన విష్ణుప్రియ, నన్ను కూడా అలా అడిగారు.. మత విశ్వాసాలను దెబ్బ తీసేలా సినిమా ట్రైలర్ ఉందనే కారణంతో ఈ చిత్రంపై అక్కడి సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాపై నిషేధం విధించింది. అభ్యంతరకరమైన సన్నివేశాలను తీసేస్తేనే... సినిమా విడుదలకు అనుమతిస్తామని తెలిపింది. ఫాంటసీ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంలో చిత్రగుప్తుడిగా అజయ్ దేవగణ్ నటించగా.. సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్‌లు కీలక పాత్రలను పోషించారు. అక్టోబర్ 24న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. చదవండి: గుర్తుపట్టలేనంతగా ‘సీతారామం’ హీరోయిన్.. షాకింగ్ లుక్ వైరల్ -
ఆ చిన్నారులకు జాతీయత చిక్కు!
మోర్తాడ్ (బాల్కొండ): కువైట్‌లోని భారత సంతతి చిన్నారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చిన్నారుల తల్లిదండ్రులు స్వదేశానికి వచ్చేందుకు కువైట్‌లోని రాయబార కార్యాలయం నుంచి ఔట్‌పాస్‌లు పొందినా ఆ చిన్నారులకు మాత్రం సాంకేతిక కారణాలు అడ్డొస్తున్నాయి. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఆస్పత్రులలో ప్రసవిస్తే ఆ ఖర్చు భరించే శక్తి లేక ఎంతో మంది కువైట్‌లో హోం డెలివరీకి ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు అదే చిన్నారులకు ఏ జాతీయత వర్తించకపోవడంతో వారిని స్టేట్లెస్ చిల్డ్రన్‌గా పరిగణిస్తున్నారు. దాదాపు 150 మంది చిన్నారులు మన దేశ సంతతివారు ఉన్నారు. పిల్లలను వదిలిపెట్టి రాలేక, నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉండలేక తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కడప జిల్లాకు చెందిన రెడ్డిబాలు దుర్గయ్య, లక్ష్మీదేవి దంపతులు మొదట కంపెనీ వీసాలపైనే కువైట్ వెళ్లారు. వీరికి ఏడేళ్ల కూతురు భాగ్యశ్రీ (7), కుమారుడు బాలు(5) ఉన్నారు. క్షమాభిక్ష వల్ల వీరికి మనదేశ రాయబార కార్యాలయం నుంచి ఔట్‌పాస్‌లు జారీ అయ్యాయి. వీరి పిల్లలకు మాత్రం జనన ధ్రువీకరణ పత్రాలు లేని కారణంగా ఔట్‌పాస్‌లు జారీ కాలేదు. క్షమాభిక్షకు గడువు మరో ఐదు రోజులే ఉంది. వీరిద్దరు స్వదేశానికి వస్తే చిన్నారుల పరిస్థితి ఏమిటనే సందేహం వ్యక్తమవుతోంది. పిల్లల కోసం అక్కడే ఉంటే జైలు శిక్షను అనుభవించాల్సిన పరి స్థితి ఏర్పడుతోంది. దీంతో చిన్నారులను వదిలి రావాలా లేక కువైట్‌లోనే ఉండాలా అని వారు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టంగుటూరి లక్ష్మీనర్సమ్మ పిల్లలు శిశుకుమార్(6), ధనలక్ష్మిలకు ఔట్‌పాస్‌లు జారీ కాలేదు. ఇలా ఎంతోమంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఔట్‌పాస్‌లను జారీ చేయాలంటూ మన విదేశాంగ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మా మనుమలు, మనమరాండ్లే గుర్తుకు వస్తున్నారు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఔట్‌పాస్‌ల కోసం తమ తల్లిదండ్రులతో వచ్చిన చిన్నారులను చూసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఐఎన్టీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు రామచంద్ర కుంతియా చలించిపోయారు. ఆ చిన్నారులను చూస్తే మా మనుమళ్లు, మనుమరాండ్లు గుర్తుకు వస్తున్నారని ‘సాక్షి’కి ఫోన్లో వెల్లడించారు. ఏ జాతీయత లేక పోయినా వారు భారత సంతతి వారిగానే గుర్తించి మన దేశం అక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. –రామచంద్ర కుంతియా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎమర్జెన్సీ సర్టిఫికెట్లను జారీ చేయాలి విదేశాంగ శాఖ కువైట్‌లోని చిన్నారులకు ఎమర్జెన్సీ సర్టిఫికెట్లను జారీ చేయాలి. కువైట్ ప్రభుత్వం ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. అందువల్ల మన విదేశాంగ శాఖ స్పందించి సర్టిఫికెట్లను వీలైనంత తొందరగా జారీ చేసి స్వదేశానికి చిన్నారులను చేర్చాలి. – డాక్టర్ వినోద్‌కుమార్, మాజీ దౌత్యవేత్త, టీపీసీసీ ఎన్ఆర్ఐ విభాగం చైర్మన్ కువైట్ ప్రభుత్వంతో చర్చించాలి కువైట్‌లో ఉన్న చిన్నారుల విషయంలో భారత ప్రభుత్వం కువైట్ ప్రభుత్వంతో చర్చించి స్వదేశానికి రప్పించాలి. అలాగే ఇక్కడకు చిన్నారులు వచ్చిన తరువాత వారికి గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించి మెరుగైన విద్యను అందించాల్సిన అవసరం ఉంది. కువైట్‌లో చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. 2011లో ఆమ్నెస్టీ సమయంలో వేగంగా చర్యలు తీసుకున్నారు. – నంగి దేవేందర్‌రెడ్డి, టీపీసీసీ గల్ఫ్ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ -
కువైట్.. స్వదేశానికి రైట్ రైట్!
సాక్షి, హైదరాబాద్: కువైట్‌లోని అక్రమ నివాసితుల కోసం అక్కడి ప్రభుత్వం సరికొత్త అవకాశం కల్పించింది. ఎలాంటి జరిమానాలు లేకుండా దేశం విడిచి వెళ్లడం లేదా జరిమానా చెల్లించి వీసా గడువు పొడిగించుకునే వెసులుబాటునిచ్చింది. ఈ మేరకు ఆ దేశ హోం శాఖ అమ్నెస్టీ డిక్రీ 64/2018ని జనవరి 23న విడుదల చేసింది. ఇది జనవరి 29 నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. ఈ డిక్రీ ఆధారంగా అక్కడ అక్రమంగా నివసిస్తున్న వారు సురక్షితంగా దేశం విడిచి వెళ్లొచ్చు. ఇందుకు సంబంధించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. కువైట్ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని అక్కడ ఉంటున్న భారతీయులు ఉపయోగించుకోవచ్చు. జరిమానా కట్టి తమ నివాసాన్ని చట్టబద్ధం చేసుకోవడమో లేదా తిరిగి స్వదేశం రావడమో చేయొచ్చు. ఇందుకోసం భారత రాయబార కార్యాలయం లేదా తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగంలోని ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖను సంప్రదించవచ్చని తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ వ్యవహారాలు చూసే ఓ అధికారి మీడియాకు తెలిపారు. జరిమానా లేకుండానే.. - కువైట్‌లో అక్రమ నివాసితులు, వీసా ముగిశాక ఉంటున్న వారు ఎలాంటి అనుమతి, జరిమానా లేకుండా దేశం విడిచిపెట్టి వెళ్లవచ్చు. ఇలాంటి వారు మళ్లీ సరైన పత్రాలతో, అన్ని అనుమతులతో తిరిగి కువైట్‌కు వెళ్లొచ్చు. అక్రమ నివాసితులు, వీసా ముగిశాక ఉంటున్న వారు కావాలనుకుంటే తగిన జరిమానా చెల్లించి వీసా పొడిగించుకుని అక్కడే ఉండిపోవచ్చు. - రెసిడెన్సీ నిబంధనలు ఉల్లఘించి నిషేధానికి గురైన వారు, కోర్టు కేసులున్న వారు ఇప్పుడు రెసిడెన్సీ అఫైర్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి తమకు వీసా వచ్చే అవకాశం ఉందేమో చర్చించుకోవాల్సి ఉంటుంది. - క్షమాభిక్ష కాలం ముగిశాక మాత్రం ఈ ఉత్తర్వులు చెల్లవు. క్షమాభిక్ష సమయంలో దొరికిన వారిని వెంటనే ఆయా దేశాలకు తరలిస్తారు. ఈ సమయంలో దేశం విడిచి పెట్టని వారిపై జరిమానా విధిస్తారు. వారికి వీసా ఇవ్వకుండా, స్వదేశం పంపించేస్తారు. వారు తిరిగి కువైట్ రాకుండా నిషేధిస్తారు. నిబంధనలు తెలీక జైలు పాలు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లడం తెలుగు రాష్ట్రాల్లో సర్వసాధారణం. అక్కడ ఇళ్లల్లో సహాయకులుగా, వివిధ కంపెనీల్లో కార్మికులుగా, పశువుల కాపర్లుగా, నిర్మాణ రంగంలో పని చేయడానికి పెద్ద సంఖ్యలో వెళ్తుంటారు. అయితే సరైన వీసా లేకపోవడం, యాజమాన్యంతో విబేధాలొచ్చి బయటకు వచ్చే వాళ్ల సంఖ్యా ఎక్కువే. కువైట్ వెళ్లే వారికి వివిధ పనుల కోసం భిన్నరకాల వీసాలు ఇస్తుంటారు. వాటిని కాదని వేరే పనులకు వెళ్లకూడదు. అంటే ఇంట్లో సహాయకులుగా పని చేయడానికి వెళ్లిన వారు, అక్కడ ఇబ్బంది ఎదురై ఇంట్లోంచి బయటకు వచ్చేస్తే వారిని నేరుగా వేరే పనిలో పెట్టుకోకూడదు. కానీ చాలా మందికి దీనిపై అవగాహన లేక పొరపాట్లు చేస్తుంటారు. తెలిసో తెలియకో కొందరు వీసా నిబంధనలు ఉల్లంఘిస్తారు. ఇంకొందరి విషయంలో యాజమాన్యాలు పాస్‌పోర్టు, వీసా తమ దగ్గర ఉంచేసుకుని వారికి తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాయి. దీనికితోడు పాస్‌పోర్టు, వీసా కాల పరిమితి ముగిసిపోవడం మరో సమస్య. దాక్కున్న వారిని ప్రభుత్వం అదుపులోకి తీసుకుంటుంది. చట్ట వ్యతిరేకంగా ఉంటున్న వారు, చిన్న తప్పులకు జైలు పాలైన వారికి సాధారణంగా రంజాన్ మాసంలో అక్కడి ప్రభుత్వం క్షమాభిక్ష పెడుతుంది. ఇది రెండేళ్లకోసారి జరిగే ప్రక్రియ. కానీ కొన్నేళ్లుగా కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రకటించడం లేదు. దీంతో పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులు అక్కడి జైళ్లలో మగ్గిపోతున్నారు. అవకాశాన్ని వినియోగించుకోండి కువైట్‌లో చిక్కుకుపోయిన విదేశీయులు ఆ దేశం ప్రకటించిన క్షమాభిక్షను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. వేర్వేరు కారణాలతో చట్ట వ్యతిరేకంగా అక్కడ ఉంటున్న విదేశీయులకు ఎలాంటి శిక్ష, జరిమానా లేకుండా తిరిగి స్వదేశానికి వెళ్లే అవకాశం కల్పించిందని పేర్కొంది. అందరికీ తెలియాలి 22 ఏళ్లుగా కువైట్‌లో ఉంటున్నాను. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చిన్న తప్పులతోనే జైలు పాలైన వారు, పాస్‌పోర్టు కాలపరిమితి ముగిసిన వారు, అక్రమ నివాసితులు దాదాపు 30 వేల మంది కువైట్‌లో ఉంటున్నారు. ఇప్పుడు ఇలాంటి వారు డబ్బులుంటే స్వదేశానికి తిరిగి వెళ్లవచ్చు. కొందరికి ఎంబసీ, స్వచ్ఛంద సంస్థలు స్వదేశానికి వెళ్లడానికి టికెట్ ఖర్చులు ఇస్తాయి. ఏడేళ్లుగా కువైట్ ప్రభుత్వం క్షమాభిక్ష ఇవ్వలేదు. వీసాతోపాటు ఇక్కడ పని చేసేందుకు ఇచ్చే అనుమతిని ‘అకామా’అంటారు. అది కచ్చితంగా ఉండాలి. మేం ఇప్పటికే దీని గురించి ప్రచారం ప్రారంభించాం. ఇలాంటి నిబంధన వచ్చిందని చాలా మందికి తెలియదు. దీని గురించి అందరికీ చెప్పాలనేదే మా ప్రయత్నం. –కొల్లాబత్తుల రాజు, కువైట్‌లో ఉంటున్న తెలంగాణ వాసి -
‘అక్రమ భారతీయుల’కు సాయం చేస్తాం
కువైట్ సిటీ: కువైట్‌లో అక్రమంగా పనిచేస్తున్న భారతీయులకు శుభవార్త! ఆ దేశంలో అక్రమంగా పనిచేస్తున్న భారతీయులు దేశం విడిచి వెళ్లిపోతామన్నా.. లేదా ఉద్యోగ వీసాల బదిలీ కోసం హోం శాఖను సంప్రదిస్తే.. వారికి జైలు శిక్షలు, జరిమానాలు విధించబోమని కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. వారికి సాయం చేయడానికి తమ ఇమిగ్రేషన్ అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పింది. కఠిన శిక్షలు ఉండే కువైట్ నుంచి ఇలాంటి ప్రకటన రావడం చాలా అరుదు. కువైట్‌లో ప్రస్తుతం దాదాపు 24 వేల మంది భారతీయులు అక్రమంగా పనిచేస్తున్నారని అంచనా. ఇలా ఇప్పటికే రెండు వేల మందికి పైగా భారతీయులను స్వదేశానికి పంపారు.