కువైట్ సిటీ: కువైట్‌లో అక్రమంగా పనిచేస్తున్న భారతీయులకు శుభవార్త! ఆ దేశంలో అక్రమంగా పనిచేస్తున్న భారతీయులు దేశం విడిచి వెళ్లిపోతామన్నా.. లేదా ఉద్యోగ వీసాల బదిలీ కోసం హోం శాఖను సంప్రదిస్తే.. వారికి జైలు శిక్షలు, జరిమానాలు విధించబోమని కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. వారికి సాయం చేయడానికి తమ ఇమిగ్రేషన్ అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పింది.
కఠిన శిక్షలు ఉండే కువైట్ నుంచి ఇలాంటి ప్రకటన రావడం చాలా అరుదు. కువైట్‌లో ప్రస్తుతం దాదాపు 24 వేల మంది భారతీయులు అక్రమంగా పనిచేస్తున్నారని అంచనా. ఇలా ఇప్పటికే రెండు వేల మందికి పైగా భారతీయులను స్వదేశానికి పంపారు.
‘అక్రమ భారతీయుల’కు సాయం చేస్తాం
Published Fri, Dec 9 2016 6:51 PM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM
Advertisement