‘గల్వాన్‌’పై అజయ్‌ దేవగన్‌ సినిమా | Ajay Devgn Announces His New Film On Galwan Valley Clash | Sakshi
Sakshi News home page

‘గల్వాన్‌’పై అజయ్‌ దేవగన్‌ సినిమా

Published Sat, Jul 4 2020 12:16 PM | Last Updated on Sat, Jul 4 2020 12:52 PM

Ajay Devgn Announces His New Film On Galwan Valley Clash - Sakshi

ముంబై: గల్వాన్‌ వ్యాలీ ఘటన ఆధారంగా సినిమా రూపొందించనున్నట్లు బాలీవుడ్‌ హీరో-నిర్మాత అజయ్‌ దేవగన్ వెల్లడించాడు. జూన్‌15న లడక్‌లోని గాల్వన్‌‌ వ్యాలీ వద్ద చైనా అర్మీ, భారత సైన్యంపై జరిపిన దాడిలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఆధారంగా అజయ్‌ దేవగన్‌ సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే ఇందులో అజయ్‌ నటిస్తారా లేదా అనేది స్ఫష్టత లేదు. కానీ ఇప్పటికే ఈ చిత్రం కోసం తారాగణాన్ని ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. అజయ్‌ దేవగన్‌ ఫిల్మ్స్‌, సెలెక్ట్‌ మీడియా హైల్డింగ్‌ ఎల్‌ఎల్‌పీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. (వినూత్నంగా వర్మ 12'0' క్లాక్‌ ట్రైలర్‌)

ఇప్పటికే అజయ్‌ దేవగన్ ప్రధాన పాత్రలో‌ 1975లో అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా పీపుల్స్‌ ఆర్మీ, భారత సైన్యంపై జరిపిన మెరుపుదాడిలో భారత సైన్యం మొట్టమొదటి సారిగా ఎదుర్కొన్న ప్రాణనష్టం ఆధారంగా ‘భుజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగస్టులో ఓటీటీలో ప్లాట్‌ఫ్లాంలో విడుదల కానుంది. అభిషేక్‌ దుధయ్య రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజయ్‌ దత్‌, సోనాక్షి సిన్హా, అమ్మి విర్క్‌, శరద్‌ కేల్కర్, రానా, దక్షిణాది భామ ప్రణతిలు ప్రధాన పాత్రల్లో నటించారు.  (దేశీ టచ్‌తో విదేశీ కథలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement