థియేటర్లలో 'థ్యాంక్‌ గాడ్' సందడి చేయనుంది ఆ రోజే.. | Thank God Movie Theater Release Date Out | Sakshi
Sakshi News home page

Thank God Movie: థియేటర్లలో 'థ్యాంక్‌ గాడ్' సందడి చేయనుంది ఆ రోజే..

Nov 21 2021 1:52 PM | Updated on Nov 21 2021 1:54 PM

Thank God Movie Theater Release Date Out - Sakshi

Thank God Movie Theater Release Date Out: బాలీవుడ్ హీరోలు అజయ్‌ దేవగన్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా, హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కలిసి నటిస్తున్న చిత్రం 'థ్యాంక్‌ గాడ్‌'. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు కొంచెం బ్రేక్‌ ఇచ్చేలా సినిమా విడుదల తేదిని ప్రకటించారు. ఈ చిత్రం జూలై 19, 2022న థియేటర్లలో సందడి చేయనున్నట్లు సినిమా తారాగణం సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. 'ఎంతగానో ఎదురుచూస్తున్న 'థ్యాంక్‌ గాడ్‌' చిత్రం వచ్చే సంవత్సరం మీకు సంతోషాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. 'సంతోషకరమైన జీవితం' అనే సందేశంతో కూడిన ఈ సినిమా 29 జూలై 2022న విడుదల కానుంది.' అని రకుల్‌ పోస్ట్‌ చేసింది. 

అజయ్‌ దేవగణ్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా మొదటిసారిగా స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న చిత్రం 'థ్యాంక్ గాడ్‌'. ఈ సినిమాకు ఇంద్ర కుమార్‌ దర్శకత్వం వహించగా, భూషణ్‌ కుమార్‌, క్రిషన్ కుమార్‌, అశోక్‌ థాకేరియా, సునీర్‌ ఖేటర్‌పాల్‌, దీపక్‌ ముకుత్‌, ఆనంద్ పండిట్‌, మార్కంద్ అధికారి నిర్మించారు. సహ నిర్మాతగా యష్ షా వ్యవహరిస్తున్నారు. డైరెక్టర్‌ ఇంద్ర కుమార్‌ గతంలో తీసిన బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకంటే 'థ్యాంక్ గాడ్‌' భిన్నంగా ఉంటుందట. ఇంద్ర కుమార్‌ ఈ సినిమాను కొత్త తరహాలో నవ‍్వులు పూయిస్తూ, చివరిలో సందేశంతో రూపొందించారు. నేటి ప్రపంచానికి తగినట్లుగా, కుటుంబాలకు కనెక్ట్‌ అవుతుందని మేకర్స్‌ తెలిపారు.

ఇంద్ర కుమార్‌ మస్తీ, ధమాల్‌ వంటి హాస్య ఫ్రాంచైజీలకు దర్శకత్వం వహించారు. ఇది ఒక సుందరమైన సందేశంతో ఉంటుందని సిద్ధార్థ్‌ మల్హోత్ర గతంలోని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. 'ఈ సినిమా ఒక సందేశాన్ని ఇస్తుంది. ప్రేక్షకులు ఆశ్చర్యపోతారని నేను హామీ ఇస్తున్నాను. కృతజ్ఞత భావం గురించి, గతంలో కంటే ఇప్పుడు ఏది ముఖ్యమో చెప్పే చిత్రం థ్యాంక్‌ గాడ్‌.' అని షేర్షా హీరో సిద్ధార్థ్‌ పేర్కొన్నారు.  

చదవండి: వర్షం ఎప్పుడైన కురుస్తుంది.. గొడుగును సిద్ధంగా ఉంచుకోండి: రకుల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement