
కీర్తి, బోనీ కపూర్, జాన్వీ
‘‘మహానటి’ చిత్రంలో మీ నటనకు ఫిదా అయిపోయాం’’ అంటూ కీర్తీ సురేశ్‌పై చాలామంది ప్రశంసల జల్లు కురిపించారు. ఈ లిస్ట్‌లో దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్‌ల పెద్ద కూమార్తె జాన్వీ కపూర్ కూడా ఉన్నారు. ఇటీవల తన ఫేవరెట్ యాక్ట్రస్ కీర్తీని ముంబైలో కలుసుకున్నారు జాన్వీ కపూర్. పై ఫొటోలో ఉన్నట్లు వీరిద్దరూ ఒకేఫ్రేమ్‌లోకి ఎలా వచ్చారు? అనేగా మీ డౌట్.. అక్కడికే వస్తున్నాం.
కీర్తీ సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సినిమాకు బోనీకపూర్ ఓ నిర్మాత. ఇందులో అజయ్ దేవగన్ హీరో. ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ మాజీ కోచ్, మేనేజర్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం చర్చల్లో భాగంగానే కీర్తి ముంబై వెళ్లారట. అక్కడ కీర్తి, జాన్వీ, బోనీకపూర్ కలిసి డిన్నర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment