
అజయ్ దేవగన్
కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘ఇండియన్’ (‘భారతీయుడు’). ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రూపొందించే పనిలో ఉన్నారు శంకర్. రాజకీయాల్లోకీ ఎంట్రీ ఇవ్వడంతో ఇదే తన లాస్ట్ సినిమా అవ్వనుందని ఆ మధ్య కమల్ ప్రకటించారు. ఫస్ట్ పార్ట్‌కు మించి ఈ సీక్వెల్ ఉండాలని స్క్రిప్ట్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారట శంకర్.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌ను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారట. మరి అజయ్ విలన్‌గా కనిపిస్తారా? గెస్ట్ పాత్రలో కనిపిస్తారో వేచి చూడాలి. ఆల్రెడీ శంకర్ ‘2.0’లో హిందీ నటుడు అక్షయ్ కుమార్ విలన్‌గా యాక్ట్ చేశారు. ఇప్పుడు ‘ఇండియన్ 2’లో అజయ్ దేవగన్. ఇలా బాలీవుడ్ నటులను కూడా తీసుకుంటే సినిమాకి హిందీ మార్కెట్ కూడా బాగుంటుందని శంకర్ ఉద్దేశం అయ్యుండొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment