లేడీ సింగమ్ శక్తీ శెట్టిగా మారారు దీపికా పదుకోన్. ‘సింగమ్’, ‘సింగమ్ రిటర్న్స్’ చిత్రాల తర్వాత బాలీవుడ్ ‘సింగమ్’ ఫ్రాంచైజీలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సింగమ్ ఎగైన్’. అజయ్ దేవగన్ మెయిన్ లీడ్ హీరోగా, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్, కరీనా కపూర్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా నుంచి దీపికా పదుకోన్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘సింగమ్ ఎగైన్’ చిత్రంలో లేడీ సింగమ్ పోలీసాఫీసర్ శక్తీ శెట్టి పాత్రలో దీపికా నటిస్తున్నారని, కథ రీత్యా క్రూరమైన, హింసాత్మక ధోరణిలో శక్తీ శెట్టి పాత్ర ఉంటుందని రోహిత్ శెట్టి పేర్కొన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment