హిందీ బిగ్‌బాస్ సీజన్-13కు బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ‘తాన్హాజీ’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఈ వీకెండ్‌కు బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, ఆయన భార్య, హీరోయిన్ కాజోల్‌లు ముఖ్య అతిథులుగా సల్మాన్‌తో కలిసి సందడి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందులో అజయ్, సల్మాన్‌లు ట్రూత్ అండ్ డేర్ గేమ్ చేర్‌లో కూర్చోగా వారికి కాజోల్ ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో కాజోల్, సల్లు భాయ్‌ని.. ‘మీకు అయిదుగురి కంటే తక్కువ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారా లేదా?’ అని ప్రశ్నించారు. దానికి అజయ్ మధ్యలో కలుగజేసుకుని.. ‘ఓకే సమయంలోనా లేదా తన జీవితం మొత్తంలోనా?’ అని అడిగాడు. దీనికి సల్మాన్.. ‘నీకు తెలుసా నా జీవితం మొత్తంలో నాకు అయిదుగురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు’ అని సమాధానం ఇచ్చాడు.
.@ajaydevgn aur @itsKajolD lagaane aa rahe hai #Tanhaji ka tadka on #WeekendKaVaar.
Watch it tonight at 9 PM.
Anytime on @justvoot @vivo_india @beingsalmankhan #BiggBoss13 #BiggBoss #BB13 #SalmanKhan pic.twitter.com/Ut4Op2YSto
— Bigg Boss (@BiggBoss) January 4, 2020
అయితే ఓ ఇంటర్యూలో తాను వర్జీన్ అని చెప్పిన భాయిజాన్‌ను అజయ్ ఆటపట్టిస్తుంటే.. ‘ అవును.. అది నిజమే ఎందుకంటే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా’ అని చెప్పాడు. దానికి కాజోల్.. ‘ఇది పచ్చి అబద్ధం. నేను అస్సలు నమ్మను. ఈ మెషీన్ కూడా నీ సమాధానాన్ని స్వీకరించట్లేదు’ అంటూ సల్మాన్‌ను ఆటపట్టించారు. అంతేగాకుండా ‘నువ్వు పెళ్లి ఎప్పుడూ చేసుకుంటావు’ కాజోల్ సల్మాన్‌ను ప్రశ్నించగా.. ‘దానికి ఇంకా చాలా సమయం ఉంది’ అని ఈ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సమాధానం ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment