
బాలీవుడ్‌లో ఎవరైనా టాప్ సెలబ్రిటీస్ వారసులను పరిచయం చేయాలంటే ముందుగా వినిపించేది దర్శక–నిర్మాత కరణ్ జోహార్ పేరు. ప్రస్తుతం అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్‌ను హిందీ తెరకు పరిచయం చేస్తున్నారు కరణ్ జోహార్. ‘ధడక్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు కరణŠ జోహార్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. మరాఠి సూపర్ íß ట్ సినిమా ‘సైర ట్’కు ఇది అఫీషియల్ రీమేక్. న్యూ ఇయర్ సందర్భంగా జాన్వీ, ఇషాన్‌కు కరణ్ జోహార్ ఓ లేఖ రాశారు. ‘కాలింగ్ కరణ్’ షోలో దాన్ని చదివి వినిపించారు కూడా.
‘‘మై డియర్ జాన్వీ, ఇషాన్ ఈ సంవత్సరంతో మీ లైఫ్‌లో సరికొత్త జర్నీ మొదలు కాబోతోంది. ఈ ఇయర్ మీకు చాలా ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్‌లు ఇవ్వనుంది. తొలి సినిమా రిలీజ్, ప్రమోషన్స్, లింక్ అప్స్, క్రిటిసిజం, పొగడ్తలు, ఫేమ్, ఫెయిల్యూర్ ఇలా ఎన్నో చూడబోతున్నారు. మీకో చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. వీటన్నింటిని అంత సీరియస్‌గా తీసుకోకండి. ఈ ఇనిషియల్ డేస్‌ను బాగా ఆస్వాదించండి. ఇవి మళ్లీ తిరిగి రావు. మీలోని బెస్ట్ క్వాలిటీస్ ఏంటంటే మీరింకా విద్యార్థులే. మీ నమ్మకాలు, మీ ఇన్నోసెన్స్ కోల్పోకుండా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు కరణ్.
నో మోర్ డిప్లోమసీ:
బాలీవుడ్ అగ్ర దర్శక–నిర్మాత కరణ్ జోహార్ న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని న్యూ రిజల్యూషన్స్ తీసుకున్నారు. ఈ సంవత్సరం నుంచి నా మిత్రుల బర్త్‌డేస్‌కు స్వయంగా కలిసి విష్ చేయాలనుకుంటున్నాను. ఇక నుంచి ట్రైలర్స్ అయినా, సినిమాలైనా నాకు మనస్ఫూర్తిగా నచ్చితేనే పొగుడుతాను. ఇది వరకు డిప్లొమసి ప్రదర్శించినందుకు సారీ. నా సినిమాల ప్రమోషన్ విరివిగా చేసుకోవాలనుకుంటున్నాను... ఎవ‡రేమనుకున్నా సరే... అంటూ తన నిర్ణయాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు కరణ్.
Comments
Please login to add a commentAdd a comment