
జాన్వీ కపూర్
బాలీవుడ్ లో కొత్త దోస్తీ కహానీ త్వరలో షురూ కానుంది. కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా ‘దోస్తానా 2’ అనే చిత్రం తెరకెక్కనుంది. అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం, ప్రియాంకా చోప్రా ముఖ్య తార లుగా 2008లో వచ్చిన ‘దోస్తానా’ చిత్రానికి ఇది సీక్వెల్. కోలిన్ డుకున్హా దర్శకత్వం వహించనున్నారు.
కరణ్ జోహార్ నిర్మించనున్నారు. త్వరలో చిత్రీకరణ మొదలు కానుంది. ఈ సినిమాలో జాన్వీ, కార్తీక్‌లతో పాటు మరో కొత్త హీరో నటించనున్నారు. అతను ఎవరు? అనే విషయాన్ని త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం ‘రుహ్ అప్జా, ‘కార్గిళ్ గాళ్’ (వీరవనిత గుంజన్ సక్సెనా బయోపిక్) సినిమాలతో బిజీగా ఉన్నారు జాన్వీ కపూర్.
Comments
Please login to add a commentAdd a comment