మరాఠీలో రేణూ డెరైక్షన్ | Pawan Kalyan's Ex-Wife Renu Desai Ropes In SJ Surya | Sakshi
Sakshi News home page

మరాఠీలో రేణూ డెరైక్షన్

Published Wed, May 7 2014 10:00 PM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM

మరాఠీలో రేణూ డెరైక్షన్

మరాఠీలో రేణూ డెరైక్షన్

 ‘మంగళాష్టక్ వన్స్ మోర్’ అనే మరాఠీ చిత్రం ద్వారా నిర్మాతగా మారిన రేణూ దేశాయ్ ఇప్పుడు దర్శకురాలిగా తన ప్రతిభ చాటుకోవడానికి రెడీ అయ్యారు. తొలి ప్రయత్నంగా ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాని స్వీయదర్శకత్వంలో రూపొందించనున్నారు రేణు. ఈ చిత్రానికి దర్శకుడు, నటుడు ఎస్.జె. సూర్య పాటలు స్వరపరచడం విశేషం. రెండు పాటలకు స్వరాలందించారాయన. వైశాలీ సమంత్ ఓ పాట పాడగా రికార్డ్ చేశారు.
 
  ఆదినాథ్ కొతారే కథానాయకునిగా నటించనున్న ఈ చిత్రానికి ముందుగా అమృతా కన్విల్కర్‌ని కథానాయికగా తీసుకున్నారు. అయితే ఇప్పుడామె స్థానంలో సులగ్నా పాణిగ్రాహిణిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు రేణూ దేశాయ్. హిందీలో పలు టీవీ సీరియల్స్ చేసి, ‘మర్డర్ 2’లో నటించిన సులగ్నాకి మరాఠీలో ఇది మొదటి సినిమా. నిర్మాతగా ‘మంగళాష్టక్ వన్స్ మోర్’ రేణూకి మంచి అనుభూతినే మిగిల్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కాకపోయినా ‘భేష్’ అనిపించుకుంది. మరి... దర్శకురాలిగా ఆమెకు ఎలాంటి అనుభూతి ఎదురవుతుందో కాలమే చెప్పాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement