Ishq Wala Love
-
అకీరా గురించి రేణు దేశాయ్ టెన్షన్..
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్.. తల్లి రేణు దేశాయ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఇష్క్ వాలా లవ్'లో ఓ చిన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం మరాఠీలో రూపొందించిన ఈ సినిమాను ప్రస్తుతం తెలుగులో డబ్ చేశారు. త్వరలో ఈ చిత్రాన్ని టెలివిజన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 'ఇష్క్ వాలా లవ్'తో అకీరా మినీ స్క్రీన్ డెబ్యూ ఇవ్వబోతున్నాడు. అకీరాను పవన్ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని రేణు ఆందోళన పడుతోంది. 'అకీరా తొలి పరిచయం గురించి ఓ చిన్నమాట.. ఈ సినిమాలో నటించినప్పుడు మా అకీరాకి 9ఏళ్లు. ఈ చిన్న డెబ్యూ రోల్‌కి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దని నా విన్నపం' అంటూ అభిమానులను ఉద్దేశించి ట్విట్టర్లో ఇటీవలే ఓ చిన్న నోట్ పోస్ట్ చేసింది రేణు. కాగా మరాఠీలో తనకు తానే డబ్బింగ్ చెప్పుకున్న అకీరా.. ఇప్పుడు తెలుగులో కూడా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్నాడట. అదే సంబరంగా చెప్పుకుంటుంది రేణు. తనయుడిని డైరెక్ట్ చేయడం అనేది తల్లిగా తనకు సెంటిమెంటల్ మొమెంట్ అంటోంది. Akira himself had dubbed both the Marathi and Telugu lines ☺️ https://t.co/PXqiqt3oq6 — renu (@renuudesai) 23 August 2016 -
యే మేరా జహా.. రేణు దేశాయ్
బద్రి సినిమాలో ‘బంగాళాఖాతంలో నీరంటే నీవేలే...’ పాట గుర్తుంది కదా! ఆ పాటలో పవన్‌తో మిస్సమ్మా.. అని అనిపించుకున్న రేణు తర్వాత నిజంగానే ఆయనకు మిస్సెస్ అయ్యింది. రెండేళ్ల కిందట పవన్‌కల్యాణ్‌తో విడాకులు తీసుకుని హైదరాబాద్‌ను ‘మిస్’ అయ్యింది. పుట్టిల్లు పుణే చేరిన రేణు సినీ నిర్మాణంలో ప్రతిభను చాటుకుంటుంది. నిర్మాతగా రెండో సినిమా, దర్శకురాలిగా తొలి సినిమా ‘ఇష్క్ వాలా లవ్’ సినిమా సక్సెస్ ట్రాక్‌లో దూసుకుపోతోంది. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన రేణుదేశాయ్‌ని ‘సిటీ ప్లస్’ పలకరించింది. హైదరాబాద్‌ను పుట్టింటితో పోల్చిన రేణు.. సిటీతో తన అనుబంధాన్ని పంచుకుంది. అందరి విషయం ఎలా ఉన్నా.. నేను మాత్రం మెట్టినింటినే పుట్టింటిగా చెబుతాను. అవును.. నాకు హైదరాబాదే పుట్టిల్లు. పుణే అత్తిల్లు. ఎందుకంటే నా స్వీట్ మెమరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ గడ్డపై అడుగుపెట్టి పదిహేనేళ్లవుతోంది. బద్రి సినిమా కోసం ఇక్కడికి వచ్చాను. అప్పట్లో నగరంలో మారుతి 800, ఎంబాసిడర్ కార్లే ఎక్కువ కనిపించేవి. ఇప్పుడు.. ఎయిర్‌పోర్టు నుంచి సిటీకి వస్తుంటే.. ఇది మన హైదరాబాదేనా అనిపిస్తోంది. మైగాడ్.. 11 కిలోమీటర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జ్. దానిపై ప్రయాణిస్తూ చాలా హ్యాపీగా ఫీలయ్యాను. గతంలో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన జ్ఞాపకాలు.. ట్రాఫిక్ జామ్‌లు గుర్తొచ్చాయి. ఆడీ, స్కోడా కార్లతో పాటు కార్లలో తిరిగే ఆడవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. ఇన్నాళ్లకు మళ్లీ హైదరాబాద్ వచ్చిన నాకు ఇక్కడి ప్రతి దృశ్యం చాలా అపురూపంగా తోచింది. చట్నీస్లోని స్టీమ్ ఇడ్లీ రుచుల విషయంలో హైదరాబాద్‌ను మించింది మరొకటి లేదు. ఇక్కడ ప్రతి ఫుడ్ టేస్టీగా ఉంటుంది. నాకు చట్నీస్ రెస్టారెంట్లో స్టీమ్ ఇడ్లీ చాలా ఇష్టం. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తెప్పించుకునేదాన్ని. అందులో ఇచ్చే చట్నీస్ సూపర్బ్. ఇక హైదరాబాద్‌కీ షాన్ ఇరానీ చాయ్ కూడా అదుర్స్. హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో ఓపెల్ ఆస్ట్రా కారు కొన్నాను. అప్పట్లో.. సిటీలోని అన్ని ప్రాంతాలూ తిరిగేదాన్ని. బద్రి, జానీ షూటింగ్ స్పాట్లను ఎప్పటికీ మరచిపోలేను. ముఖ్యంగా గోల్కొండ టూంబ్స్. అక్కడ కొన్ని నెలలు షూటింగ్ జరిగింది. ఇలా సినిమాల కోసం నగరంలోని చాలా ప్రాంతాలను విజిట్ చేశాను. ఎంత మార్పో... బద్రి సినిమాతో నటిగా పరిచయమయ్యాను. ఆ తర్వాత ‘ఖుషి’ సినిమాలోని ‘ఏ మేరా జహా..’ పాటకు ఎడిటింగ్ నే నే చేశా. ఆ సినిమా టైటిల్స్‌లో అసిస్టెంట్ డెరైక్టర్ల లిస్ట్‌లో నా పేరూ కనిపిస్తుంది. తర్వాత జానీ సినిమాలో నటించడమే కాక, అసిస్టెంట్ డెరైక్టర్‌గానూ పనిచేశాను. వరుసగా కొన్నేళ్లపాటు షూటింగ్లో పాల్గొనడం వల్ల నగరంలో చాలా ప్రాంతాలను దగ్గరగా చూసే చాన్స్ వచ్చింది. పదిహేనేళ్ల కిందటి హైదరాబాద్‌కు ఇప్పటికి చాలా తేడా ఉంది. ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఏమైనా.. నాకు కొత్త లైఫ్ ఇచ్చిన ఈ మహానగరం నాకెప్పుడూ ప్రత్యేకమే. ఇక నగరంలో నాకు ఇష్టమైన ప్లేస్ అంటారా.. (నవ్వుతూ) మీ అందరికీ తెలిసిందే నందగిరిహిల్స్. - భువనేశ్వరి -
రేణూ దేశాయ్ 'ఇష్క్ వాలా లవ్' వర్కింగ్ స్టిల్స్
-
పవర్‌స్టార్ వారసుడు వచ్చేస్తున్నాడు!
పవర్‌స్టార్ తనయుడు అకిరా నందన్ త్వరలో వెండితెరపై కనిపించబోతున్నాడు. ఇది నిజంగా పవన్‌కల్యాణ్ అభిమానులకు శుభవార్తే. ఈ విషయాన్ని పవన్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ స్వయంగా ఫేస్బుక్ ద్వారా తెలిపారు. ఆమె మరాఠీలో ‘ఇష్క్ వాలా లవ్’ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెలి సిందే. ఈ సినిమాలోని ఓ ప్రత్యేక పాత్రలో అకిరానందన్ కనిపిస్తాడు. ‘‘అకిరా నందన్... నా ‘ఇష్క్ వాలా లవ్’లో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. నేను దర్శకత్వం వహిస్తున్న సినిమా ద్వారా నా తనయుడు నటునిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది’’ అని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు రేణూ దేశాయ్. ఈ సినిమా ప్రచార చిత్రాలను కూడా ఇటీవల విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమాను అనువదించనున్నట్లు గతంలో రేణూ దేశాయ్ వెల్లడించిన విషయం తెలిసిందే. అంటే... త్వరలోనే పవర్ వారసుణ్ణి తెరపై చూడొచ్చన్నమాట. -
మరాఠీలో రేణూ డెరైక్షన్
‘మంగళాష్టక్ వన్స్ మోర్’ అనే మరాఠీ చిత్రం ద్వారా నిర్మాతగా మారిన రేణూ దేశాయ్ ఇప్పుడు దర్శకురాలిగా తన ప్రతిభ చాటుకోవడానికి రెడీ అయ్యారు. తొలి ప్రయత్నంగా ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాని స్వీయదర్శకత్వంలో రూపొందించనున్నారు రేణు. ఈ చిత్రానికి దర్శకుడు, నటుడు ఎస్.జె. సూర్య పాటలు స్వరపరచడం విశేషం. రెండు పాటలకు స్వరాలందించారాయన. వైశాలీ సమంత్ ఓ పాట పాడగా రికార్డ్ చేశారు. ఆదినాథ్ కొతారే కథానాయకునిగా నటించనున్న ఈ చిత్రానికి ముందుగా అమృతా కన్విల్కర్ని కథానాయికగా తీసుకున్నారు. అయితే ఇప్పుడామె స్థానంలో సులగ్నా పాణిగ్రాహిణిని హీరోయిన్గా ఎంపిక చేశారు రేణూ దేశాయ్. హిందీలో పలు టీవీ సీరియల్స్ చేసి, ‘మర్డర్ 2’లో నటించిన సులగ్నాకి మరాఠీలో ఇది మొదటి సినిమా. నిర్మాతగా ‘మంగళాష్టక్ వన్స్ మోర్’ రేణూకి మంచి అనుభూతినే మిగిల్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కాకపోయినా ‘భేష్’ అనిపించుకుంది. మరి... దర్శకురాలిగా ఆమెకు ఎలాంటి అనుభూతి ఎదురవుతుందో కాలమే చెప్పాలి.