'ఆ సినిమా తప్పక చూడాలి' | Aamir Khan applauds Nana Patekar's 'Natsamrat' | Sakshi
Sakshi News home page

'ఆ సినిమా తప్పక చూడాలి'

Published Wed, Feb 17 2016 6:37 PM | Last Updated on Sun, Sep 3 2017 5:50 PM

'ఆ సినిమా తప్పక చూడాలి'

'ఆ సినిమా తప్పక చూడాలి'

ముంబై: నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ తెరకెక్కించిన మరాఠీ సినిమా 'నటసామ్రాట్'ను ఆమిర్‌ ఖాన్ ప్రశంసించాడు. నానాపటేకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను అందరూ తప్పక చూడాలని కోరారు.

'మంగళవారం రాత్రి నటసామ్రాట్ చిత్రం చూశాను. సినిమా చాలా బాగుంది. నానాపటేకర్ నటన అద్భుతంగా ఉంది. నిజంగా నానా నటన సూపర్బ్. విక్రమ్ గోఖలే నటన ఆకట్టుకుంది. అందరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఇంత మంచి సినిమా తీసినందుకు మంజ్రేకర్, నానాపటేకర్, విక్రమ్ జీ, చిత్రయూనిట్ కు థ్యాంక్స్' అని ఆమిర్ ఖాన్ ట్విటర్ లో పేర్కొన్నాడు.

స్వర్గీయ వివి శిరవాద్కర్ ప్రముఖ నాటకం కుసుమగ్రాజ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. 'నటసామ్రాట్'లో గణపతి రామచంద్ర బెల్ వాకర్ పాత్రలో నానాపటేకర్ నటించాడు. విలియం షేక్స్ స్పియర్ నాటకాలతో నటసామ్రాట్ గా ఎదిగిన సీనియర్ ధియేటర్ ఆర్టిస్టు ఆ తర్వాత ఎలా పతనమైయ్యాడనే కథతో ఈ సినిమా సాగుతుంది. మేధా మంజ్రేకర్, మృణ్మమయి దేశ్ పాండే, అజిత్ పరబ్, సుశీల్ బార్వే తదితరులు ఈ చిత్రంలో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement