
అవును. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ని చూస్తే కుర్రకారు గుండె వేగంగా కొట్టుకోవడం ఖాయం. ఆ జనరేషన్‌లో శ్రీదేవి గొప్ప అందగత్తె అయితే ఈ తరంలో ఆమె కుమార్తె జాన్వీ కూడా గొప్ప అందగత్తెల లిస్టులో ఉంటుంది. అందుకే జాన్వీని పరిచయం చేస్తూ, నిర్మించనున్న చిత్రానికి ‘ధడక్’ అని టైటిల్ పెట్టాలని నిర్మాత కరణ్ జోహార్ అనుకున్నారేమో. ధడక్ అంటే హార్ట్ బీట్ అని అర్థం. మరాఠీ బ్లాక్‌బస్టర్ మూవీ ‘సైరాట్’కి ఇది రీమేక్. ఈ సినిమా గురించి ప్లాన్ జరిగి చానాళ్లయింది. కానీ, ఇంకా పట్టాలెక్కలేదు. దాంతో ‘సైరాట్’ రీమేక్ లేనట్లే అనే వార్తలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో సినిమాని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయని, ‘ధడక్’ టైటిల్ కన్ఫర్మ్ చేశారనే వార్త వచ్చింది. ‘బద్రినాథ్ కీ దుల్హనియా’ ఫేమ్ శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘సైరాట్’ మహారాష్ట్ర నేపథ్యంలో ఉంటుంది. హిందీ రీమేక్‌ని మాత్రం హర్యానా బ్యాక్‌డ్రాప్‌లో తీయనున్నారు. అన్నట్లు.. ఈ చిత్రంలో హీరో ఎవరో తెలుసా? ప్రముఖ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలవుతుంది. ఇప్పటికే జాన్వీ పలు కార్యక్రమాల్లో చిట్టి పొట్టి దుస్తుల్లో దర్శనమిచ్చి, కుర్రాళ్ల మతులు పోగొట్టారు. ఇక.. సిల్వర్ స్క్రీన్‌పై ఈ అందాల రాశిని చూశాక.. వాళ్ల గుండె లబ్ డబ్‌కి బదులు ధడక్ ధడక్... అని కొట్టుకుంటుందేమో!
Comments
Please login to add a commentAdd a comment