మాధురీ దీక్షిత్
ఎన్ని ఉన్నాయ్ మీ లైఫ్‌లో. మీరు మనసారా చేయాలనుకుని వీలుపడక పెండింగ్‌లో ఉన్న పనులెన్ని ఉన్నాయ్. అది.. ఓ ట్రిప్ కావచ్చు. వర్షంలో తడవటం అయ్యిండొచ్చు. చలికాలంలో ఐస్‌క్రీమ్ తినడం కావచ్చు. ఎండలో వేడి వేడిగా టీ తాగటం అయ్యిండొచ్చు. ఏంటీ.. ఫన్నీగా ఉన్నాయ్ కదూ. అవును.. ఇలాంటి సరదా సరదా కోరికలు చాలామందికి ఉంటాయి. రొటీన్‌గా ఉంటే అది ఫన్నీ ఎందుకు అవుతుంది? అందుకే లైఫ్‌లో ఆస్వాదించాలనుకున్న సరదాలను ఓ లిస్ట్‌గా చేసుకుని లైఫ్ రైడ్‌ను ఎంజాయ్ చేయడానికి రయ్ రయ్‌మంటూ బయల్దేరారు మాధురీ దీక్షిత్. అయితే ఇది పర్సనల్ రైడ్ కాదు. ఇదే కాన్సెప్ట్ మీద ఆమె ఓ మరాఠీ సినిమా చేస్తున్నారు.
తేజాస్ ప్రభ విజయ్ దర్శకత్వంలో కరణ్‌జోహర్ నిర్మాణంలో మాధురీ దీక్షిత్ ముఖ్య తారగా ‘బక్కెట్ లిస్ట్’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. లైఫ్‌లో సెల్ఫ్ డిస్కవరీ అండ్ ఫన్నీ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేసే కాన్సెప్ట్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది మాధురీకి తొలి మరాఠి మూవీ కావడం విశేషం. అంతేకాదు ఆల్మోస్ట్ నాలుగేళ్ల తర్వాత మాధురీ దీక్షిత్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్న సినిమా ఇదే. 2014లో ‘గులాబ్ గ్యాంగ్’ సినిమాలో సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు మాధురి. ‘‘మరాఠీ సినిమాల్లో మంచి కంటెంట్ ఉంటుంది. ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది. నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు మాధురి. ఈ సినిమా మే 25న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment