Prabhas avatar in 'Kalki 2898 AD' takes the internet by storm - Sakshi
Sakshi News home page

అంతం ఆరంభమవుతుంది! 

Published Sat, Jul 22 2023 1:31 AM | Last Updated on Sat, Jul 22 2023 10:22 AM

Prabhas took  the avatar of Kalki on silver screen - Sakshi

వెండితెరపై ప్రభాస్‌ కల్కి అవతారం ఎత్తారు. ప్రభాస్, కమల్‌హాసన్, అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ముఖ్య తారలుగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్‌ కె’ వర్కింగ్‌ టైటిల్‌తో ఓ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ‘శాన్‌ డియాగో కామిక్‌ కాన్‌ – 2023’ వేడుకలో ఈ సినిమాకు ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్‌ను ఖరారు చేసినట్లు శుక్రవారం వెల్లడించి, గ్లింప్స్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. ‘ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుంది.

అప్పుడు అంతం ఆరంభం అవుతుంది’ అన్నట్లుగా ఈ వీడియోలో ఉంది. ఈ వేడుకలో  కమల్‌హాసన్‌ మాట్లాడుతూ– ‘‘మేం స్టోరీలు చేస్తుంటే వారు (ఆడియన్స్‌) మమ్మల్ని స్టార్స్‌ చేస్తున్నారు. ‘కల్కి 2898 ఏడీ’లో పెద్ద విజన్‌ ఉంది. ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో నాగ్‌ అశ్విన్‌ నా క్యారెక్టర్‌ను డిజైన్‌ చేసిన తీరు బాగా నచ్చింది. సినిమాలో స్ట్రాంగ్‌ ఎమోషన్స్‌ ఉన్నాయి’’ అన్నారు ప్రభాస్‌. ‘‘ఈ సినిమా నాకో అద్భుతమైన అనుభవం. దీని వెనక గొప్ప పరిశోధన ఉంది’’ అని వర్చ్యువల్‌గా అమితాబ్‌ బచ్చన్‌ మాట్లాడారు. ‘‘నేను సైన్స్‌ ఫిక్షన్, పురాణాలను ఇష్టపడతాను.

మహాభారతం, స్టార్‌ వార్స్‌... రెండింటినీ చూస్తూ, వింటూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ పుట్టింది’’ అన్నారు నాగ్‌ అశ్విన్‌. ‘‘ఈ సినిమా మాకు గర్వకారణం’’ అన్నారు నిర్మాత అశ్వనీదత్‌. ఈ వేడుకలో రానా, ప్రియాంకా దత్, స్వప్నా దత్‌ పాల్గొన్నారు. ‘కల్కి 2898 ఏడీ’ను 2024 జనవరి 12న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు. 

రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తా: ప్రభాస్‌ 
రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తానని ప్రభాస్‌ ‘కామిక్‌ కాన్‌–2023’ వేడుకల్లో చెప్పారు. ఈ వేడుకల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రస్తావన రాగా... ‘‘భారతదేశంలో ఉన్న అద్భుతమైన దర్శకుల్లో రాజమౌళిగారు ఒకరు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని పాటకు ఆస్కార్‌ రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. అది దేశ ప్రజలందరికీ దక్కిన గౌరవంగా భావించాం. అలాగే రామ్‌చరణ్‌ నాకు మంచి మిత్రుడు. ఏదో ఒక రోజు మేం కచ్చితంగా కలిసి సినిమా చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు ప్రభాస్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement