
టాటూ తెచ్చిన తంటా
బెంగళూరులో విదేశీ జంటపై బీజేపీ కార్యకర్తల వీరంగం!
బెంగళూరు: శరీరంపై హిందూ దేవత టాటూ వేసుకున్నందుకు బెంగళూరులో ఓ ఆస్ట్రేలియా జాతీయుడు, అతని స్నేహితురాలిని బీజేపీ కార్యకర్తలు వేధింపులకు గురిచేయడం వివాదాస్పదమైంది. ఆస్ట్రేలియాలోని డైకిన్ వర్సిటీ లా విద్యార్థి మాట్ కీత్...తన స్నేహితురాలు ఎమిలీతో కలసి శనివారం ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అయితే కీత్ కాలిపై ఎల్లమ్మ టాటూ ఉండటంతో(వీపుపై గణేశ్ టాటూ కూడా ఉంది) బీజేపీ కార్యకర్తలుగా భావిస్తున్న వారు అభ్యంతరం తెలిపారు. గొడవ రేగడంతో పోలీసులు అక్కడకు చేరుకొని విదేశీ జంటను పోలీసు స్టేషన్‌కు తరలించారు.
హిందువుల మనోభావాలు దెబ్బతీశారని వారి చేత బలవంతంగా క్షమాపణ లేఖ రాయించుకొని విడిచిపెట్టారు. కాగా, ఈ వివాదంపై స్థానిక బీజేపీ నేత రమేశ్ యాదవ్ స్పందిస్తూ ఆస్ట్రేలియన్ టాటూను పదేపదే ప్రదర్శించాడని... అతని భద్రత దృష్ట్యా పోలీసులను పిలిచినట్లు చెప్పారు.తమ దేశ పౌరుడిపై దాడిపట్ల ఢిల్లీలోని ఆస్ట్రేలియా రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది.