వాషింగ్టన్ : మద్యం వల్ల ఆరోగ్యం పాడవుతుందని మన అందరికీ తెలుసు. మద్యాన్ని అధికంగా తీసుకోవడం వల్ల మనసు, శరీరం, మొదడు మొద్దువారిపోతాయని పెద్దలు చెబుతారు. అయితే తాజాగా వెలువడిన ఒక రీసెర్చ్ మద్యపానం గురించిన ఆసక్తిక విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా రెండుమూడు భాషలు మాట్లాడేవారికి మద్యం తీసుకోవడం చాలా మేలు చేస్తుందని రీసెర్చ్‌చెబుతోంది. తగితన మోతాదులో తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరగడంతో పాటు, చేసే పనులలో శ్రద్ద, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని రీసెర్చ్ స్పష్టం చేస్తోంది. చాలామందిలో కనిపించే యాంగ్జయిటీ (ఆత్రుత సమస్య) మద్యం వల్ల తగ్గుతుందని రీసెర్చ్ ప్రకటించింది.
మద్యం తాగే అలవాటున్న 50 మందిపై డచ్ యూనివర్సిటీ ర్యాండమ్‌గా ఒక పరిశోధన చేసింది. అందరికీ వారివారి బరువులో 5 శాతం బీరు తాగించి.. ఇతర భాషా ప్రావీణ్యతపై పరిశోధకులు పలు ప్రశ్నలు అడిగారు. ఇందులో మద్యం తాగిన వారు ఇతర భాషలపై తమకున్న పట్టును నిరూపించుకున్నారు. వారు మాట్లాడే మాటలను ఆడియో రికార్డ్ కూడా చేసినట్లు పరిశోధకులు ప్రకటించారు.
మద్యంతో భాషా ప్రావీణ్యం
Published Thu, Oct 19 2017 5:12 PM | Last Updated on Thu, Oct 4 2018 8:09 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment