విదేశీ చెల్లింపుల్లో రూ.2200 కోట్ల అక్రమాలు | CBI books 13 firms in foreign remittance scam of over Rs 2200 crore | Sakshi
Sakshi News home page

విదేశీ చెల్లింపుల్లో రూ.2200 కోట్ల అక్రమాలు

Published Tue, May 16 2017 3:05 PM | Last Updated on Thu, Oct 4 2018 8:09 PM

విదేశీ చెల్లింపుల్లో రూ.2200 కోట్ల అక్రమాలు - Sakshi

విదేశీ చెల్లింపుల్లో రూ.2200 కోట్ల అక్రమాలు

న్యూఢిల్లీ: విదేశీ చెల్లింపుల్లో రూ.2200 కోట్ల అక్రమాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. విదేశాల నుంచి వస్తువులు దిగుమతి చేసుకుని రూ.24.34 కోట్ల విలువ జేసే బిల్లులకు గాను రూ.2200 కోట్లు చెల్లింపులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు స్టెల్కోన్‌ ఇన్ఫ్రాటెల్‌ లిమిటెడ్‌(ఎస్‌ఐపీఎల్‌)తో పాటు మరో 12 కంపెనీలపై కేసు నమోదు చేశారు. 2015–16 సంవత్సరంలో మోసపూరితంగా వస్తువులను దిగుమతి చేసుకోవడమే కాక.. పెద్దమొత్తంలో అక్రమ చెల్లింపులు జరిపినట్లు సీబీఐ పేర్కొంది.

ఈ కంపెనీల బ్యాంకు ఖాతాలన్నీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులోనే ఉన్నాయని.. వాటి నుంచే లావాదేవీలు జరిగినట్లు ఆరోపించింది. 25 బిల్లులకుగాను రూ.3.14 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. కేవలం ఆరు బిల్లులకే రూ.680.12 కోట్లు చెల్లించారని వివరించింది. ఎస్‌ఐపీఎల్‌ చట్టవిరుద్ధంగా ఈ లావాదేవీలు జరిపినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. అదేవిధంగా మిగతా కంపెనీలు కూడా రూ.1572.7 కోట్ల మేర అక్రమాలకు పాల్పడడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement