
విదేశీ పోస్టాఫీసుల ద్వారా స్మగ్లింగ్!
న్యూఢిల్లీ: ఇటీవల క్రమంగా విదేశీ పోస్టాఫీసుల ద్వారా తుపాకులు, పిస్టల్స్, సిగరెట్లు, మెమరీ కార్డులు అక్రమ రవాణా జరుగుతుండడంతో కస్టమ్స్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొన్ని నెలలుగా 50 తుపాకులు, పిస్టల్స్, కాట్రిడ్జ్‌లను ఢిల్లీ విదేశీ పోస్టాఫీసు నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ కస్టమ్ అధికారి చెప్పారు. నిబంధనల ప్రకారం జాతీయ, రాష్ట్ర రైఫిల్ అసోసియేషన్ నుంచి లెసైన్స్ కలిగిన వారు మాత్రమే తుపాకులు దిగుమతి చేసుకోవాలన్నారు. ఈ పార్సిళ్లు హాంకాంగ్ నుంచి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.