16 సెన్సెక్స్ కంపెనీల్లో పెరిగిన విదేశీ వాటా | Foreign Portfolio Investors buy shares worth Rs 17,000 cr in 16 Sensex companies in Q1 | Sakshi
Sakshi News home page

16 సెన్సెక్స్ కంపెనీల్లో పెరిగిన విదేశీ వాటా

Published Mon, Jul 25 2016 1:52 AM | Last Updated on Thu, Jul 11 2019 8:48 PM

16 సెన్సెక్స్ కంపెనీల్లో పెరిగిన విదేశీ వాటా - Sakshi

16 సెన్సెక్స్ కంపెనీల్లో పెరిగిన విదేశీ వాటా

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఏప్రిల్-జూన్ కాలానికి 16 సెన్సెక్స్ కంపెనీల్లో తమ వాటాలను పెంచుకున్నారు. ప్రస్తుత విలువల ప్రకారం రూ.17,465 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అయితే 13 సెన్సెక్స్ కంపెనీల్లో తమ వాటాను తగ్గించుకున్నారు. ఈ 13 కంపెనీల్లో రూ.14,389 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దీంతో సెన్సెక్స్ కంపెనీల్లో వీరి నికర పెట్టుబడులు రూ.3,076  కోట్లుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలానికి విదేశీ ఇన్వెస్టర్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కంపెనీలో అధికంగా (6.58 శాతం) వాటా కొనుగోలు చేశారు.

ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్‌లో యాక్సిస్ బ్యాంక్‌లో  42.27 శాతంగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్ల వాటా ఈ ఏడాది జూన్ క్వార్టర్‌కు 45.81 శాతానికి పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement