బంజారాహిల్స్లో పట్టుబడ్డ విదేశీ మద్యం | Foreign liquor seized in banjarahills | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్లో పట్టుబడ్డ విదేశీ మద్యం

Published Tue, Sep 23 2014 2:23 PM | Last Updated on Thu, Oct 4 2018 8:09 PM

బంజారాహిల్స్లో పట్టుబడ్డ విదేశీ మద్యం - Sakshi

బంజారాహిల్స్లో పట్టుబడ్డ విదేశీ మద్యం

హైదరాబాద్ : హైదరాబాద్ బంజారాహిల్స్లో భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1లో సోనా వైన్ షాపులో సోదాలు జరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఎక్సైజ్ అధికారులు  ఈ సోదాలు చేస్తున్నారు.

అక్రమంగా విదేశీ మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందటంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న పది లక్షల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వైన్ షాపు నిర్వహకుడు జయకిషన్ను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోనా వైన్స్తో పాటు నగరంలో పలు మద్యం దుకాణాలలో తనిఖీలు చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement