బంజారాహిల్స్లో పట్టుబడ్డ విదేశీ మద్యం
హైదరాబాద్ : హైదరాబాద్ బంజారాహిల్స్లో భారీగా విదేశీ మద్యం పట్టుబడింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1లో సోనా వైన్ షాపులో సోదాలు జరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఎక్సైజ్ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు.
అక్రమంగా విదేశీ మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందటంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న పది లక్షల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వైన్ షాపు నిర్వహకుడు జయకిషన్ను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోనా వైన్స్తో పాటు నగరంలో పలు మద్యం దుకాణాలలో తనిఖీలు చేపట్టారు.