కదిరిలో గల్ఫ్ ఏజెంట్ల ఘరానా మోసం
కదిరి : అనంతపురం జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట ప్రజలను గల్ఫ్కు తరలించి అక్కడ ఏజెంట్లకు అమ్మేసిన ఘటన చోటుచేసుకుంది.
కదిరికి చెందిన గల్ఫ్ ఏజెంట్లు నలుగురు మహిళలు సహా ఐదుగురిని సౌదీఅరేబియాలోని ఏజెంట్లకు విక్రయించారు. మోసపోయామని గుర్తించిన బాధితులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు కదిరి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.